Ulli Karam Dosa : ఉల్లికారం దోశ‌ను ఎప్పుడైనా తిన్నారా.. భ‌లే రుచిగా ఉంటుంది..!

Ulli Karam Dosa : మ‌నం ఉద‌యం అల్పాహారంలో భాగంగా దోశ‌ల‌ను త‌యారు చేస్తూ ఉంటాం. చాలా మంది దోశ‌ల‌ను ఇష్టంగా తింటూ ఉంటారు. దోశ‌ల‌ను త‌యారు చేయ‌డం సుల‌భ‌మే. ప్లెయిన్ దోశ‌ల‌నే కాకుండా మ‌నం వివిధ ర‌కాల దోశ‌ల‌ను కూడా త‌యారు చేస్తూ ఉంటాం. అందులో ఉల్లికారం దోశ కూడా ఒక‌టి. ఉల్లికారం దోశ‌ను కూడా చాలా సులువుగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఉల్లికారం దోశ‌ను ఏ విధంగా త‌యారు చేసుకోవాలి.. దాని త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు ఏమిటి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

ఉల్లికారం దోశ‌ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోశ పిండి – త‌గినంత‌, ఉల్లిపాయ‌లు – 2 (మ‌ధ్య‌స్థంగా ఉన్నవి), ఉప్పు – త‌గినంత‌, కారం – అర టీ స్పూన్, పంచ‌దార – పావు టీ స్పూన్, నూనె – అర క‌ప్పు.

Ulli Karam Dosa have you tasted it very delicious
Ulli Karam Dosa

ఉల్లికారం దోశ త‌యారీ విధానం..

ముందుగా ఉల్లిపాయ‌ల‌ను పెద్ద పెద్ద ముక్క‌లుగా కోసి జార్ లో వేసుకోవాలి. ఇందులోనే ఉప్పు, కారం, పంచ‌దార వేసి మెత్త‌గా మిక్సీ ప‌ట్టి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు పెనం మీద ప‌లుచ‌గా దోశ‌ను వేసుకోవాలి. దోశ కొద్దిగా కాలిన త‌రువాత ముందుగా మిక్సీ ప‌ట్టుకున్న ఉల్లిపాయ మిశ్ర‌మాన్ని దోశ మీద వేసి దోశంతా వ‌చ్చేలా స్పూన్ తో ప‌రుచుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక నిమిషం పాటు ఉంచి త‌రువాత మూత తీసి దోశ‌ను ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే ఉల్లికారం దోశ త‌యార‌వుతుంది. దీనిని ప‌ల్లీ చ‌ట్నీ, కొబ్బ‌రి చ‌ట్నీల‌తో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. దీనిని నేరుగా తిన్నా కూడా రుచిగా ఉంటుంది. త‌ర‌చూ చేసుకునే ప్లెయిన్‌ దోశ‌కు బ‌దులుగా అప్పుడ‌ప్పుడూ ఇలా ఉల్లికారం దోశ‌ను కూడా త‌యారు చేసుకుని తిన‌వ‌చ్చు.

Share
D

Recent Posts