Vankaya Kura : ఉల్లి వెల్లుల్లి లేకుండా క‌మ్మ‌నైన వంకాయ కూర ఇలా చేయండి.. అన్నంలో తింటే సూప‌ర్‌గా ఉంటుంది..!

Vankaya Kura : మ‌నం వంకాయ‌ల‌ను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. వాటితో ర‌క‌ర‌కాల వంట‌కాల‌ను త‌యారు చేసి తీసుకుంటూ ఉంటాము. వంకాయ‌ల‌తో చేసుకోగిన వంట‌కాల్లో వంకాయ కూర కూడా ఒక‌టి. వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని ఒక్కొక్క‌రు ఒక్కో ప‌ద్ద‌తిలో త‌యారు చేస్తూ ఉంటారు. కింద చెప్పిన విధంగా త‌యారు చేసే వంకాయ కూర చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. ప్ర‌త్యేకంగా త‌యారు చేసిన మ‌సాలా వేసి చేసే ఈ వంకాయ కూర ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా తేలిక‌. మ‌రింత రుచిగా, సుల‌భంగా వంకాయ కూర‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వంకాయ కూర తయారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – ఒక టీ స్పూన్, త‌రిగిన ట‌మాటాలు – 3, క‌రివేపాకు – రెండు రెమ్మ‌లు, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 3, వంకాయ‌లు – పావుకిలో, ప‌సుపు – అర టీ స్పూన్, ఉప్పు – త‌గినంత‌, నాన‌బెట్టిన చింత‌పండు – నిమ్మ‌కాయంత‌, నీళ్లు – ముప్పావు కప్పు, బెల్లం తురుము – ఒక టీ స్పూన్, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా.

Vankaya Kura recipe make it without any onion or garlic
Vankaya Kura

మ‌సాలా పొడి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

శ‌న‌గ‌ప‌ప్పు – 2 టేబుల్ స్పూన్స్, ధ‌నియాలు – ఒక టీ స్పూన్, జీల‌క‌ర్ర – అర టీ స్పూన్, మెంతులు – పావు టీ స్పూన్, ఎండుమిర్చి – 5.

వంకాయ కూర తయారీ విధానం..

ముందుగా మ‌సాలా పొడికి క‌ళాయిలో శ‌న‌గ‌పప్పు వేసి వేయించాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాలు వేసి వేయించాలి. దినుసుల‌న్నీ చ‌క్క‌గా వేగిన త‌రువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్త‌ని పొడిగా చేసుకోవాలి. త‌రువాత క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి. త‌రువాత ఆవాలు వేసి వేయించాలి. త‌రువాత ట‌మాట ముక్క‌లు, క‌రివేపాకు, ప‌చ్చిమిర్చి వేసి వేయించాలి. ట‌మాట ముక్క‌లు మెత్త‌బ‌డిన త‌రువాత వంకాయ ముక్క‌లు, ప‌సుపు, ఉప్పు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి 2 నిమిషాల పాటు వేయించాలి. త‌రువాత చింత‌పండు ప‌లుసు వేసి క‌ల‌పాలి. వీటిపై మూత పెట్టి ఉడికించాలి. ముక్క‌లు స‌గానికి పైగా ఉడికిన త‌రువాత నీళ్లు, బెల్లం తురుము వేసి క‌ల‌పాలి. త‌రువాత మూత పెట్టి ముక్క‌లు మెత్త‌గా అయ్యే వ‌ర‌కు ఉడికించాలి. త‌రువాత మిక్సీ ప‌ట్టుకున్న పొడి వేసి మ‌రో 2 నిమిషాల పాటు ఉడికించాలి. చివ‌ర‌గా కొత్తిమీర చ‌ల్లుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వంకాయ కూర త‌యార‌వుతుంది. దీనిని అన్నంతో తింటే చాలా రుచిగా ఉంటుంది.

Share
D

Recent Posts