Leaves For Cholesterol : మన శరీరానికి అవసరమయ్యే పోషకాల్లో కొలెస్ట్రాల్ కూడా ఒకటి. విటమిన్ల తయారీలో, హార్మోన్ల ఉత్పత్తితో, కొత్త కణాల తయారీలో ఇలా అనేక రకాలుగా కొలెస్ట్రాల్ మన శరీరానికి అవసరమవుతుంది. కొలెస్ట్రాల్ లో చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ అని రెండు రకాలు ఉంటాయి. అయితే నేటి తరుణంలో మనలో చాలా మంది చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల మనం అనేక రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరగడం వల్ల అధిక రక్తపోటు, గుండెపోటు, హార్ట్ ఎటాక్, ఊబకాయం వంటి అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక ఈ సమస్య నుండి మనం వీలైనంత త్వరగా బయటపడాలి. చెడు కొలెస్ట్రాల్ సమస్యలతో బాధపడే వారు మందులకు బదులుగా కొన్ని రకాల ఆయుర్వేద చిట్కాలను వాడడం వల్ల మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు ఈ ఆకులను తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. చెడు కొలెస్ట్రాల్ సమస్యతో బాధపడే వారు వేప ఆకులను తీసుకోవడం వల్ల సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. వేప ఆకుల్లో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించే లక్షణాలు ఉంటాయి. లేత వేప ఆకులను తినడం వల్ల అలాగే వేప ఆకుల పొడిని నీటిలో వేసి మరిగించి రోజుకు 2 నుండి 3 సార్లు తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో తులసి ఆకులు కూడా మనకు ఎంతో మేలు చేస్తాయి. తులసి ఆకులను ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. తరువాత ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకుల పొడి వేసి బాగా మరిగించాలి. తరువాత ఈ టీని తాగాలి.
ఇలా తాగడం వల్ల కొలెస్ట్రాల్ సమస్య నుండి చాలా సులభంగా బయటపడవచ్చు. ఇక నేరేడు ఆకులను ఉపయోగించడం వల్ల కూడా సమస్య తగ్గు ముఖం పడుతుంది. నేరేడు ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఆంథోసైనిస్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను కరిగించడంలో దోహదపడతాయి.నేరేడు ఆకులను పొడిగా చేసి నీటిలో వేసి మరిగించాలి. ఈ నీటిని రోజుకు 3 సార్లు తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అదే విధంగా మెంతి ఆకులను ఉపయోగించడం వల్ల కూడా సులభంగా సమస్య తగ్గుతుంది. మెంతుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో దోహదపడుతుంది. మెంతి ఆకులను సలాడ్స్ లో వేసుకోవడం వల్ల అలాగే మెంతి ఆకులను నీటిలో వేసి రాత్రంతా నానెట్టి ఉదయాన్నే ఆ నీటిని తాగాలి. ఇలా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. ఈ విధంగా ఈ 4 రకాల ఆకులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ సమస్య తగ్గుతుందని అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.