Varun Tej : ఈ మధ్య కాలంలో మెగా బ్రదర్ నాగబాబు కుటుంబం తరచూ వార్తల్లో నిలుస్తోంది. నాగబాబు కూతురు నిహారిక తన ఇన్ స్టా అకౌంట్ ను డిలీట్ చేసిన విషయం తెలిసిందే. కాగా నిహారిక వ్యవహారం అత్తింటి వారికి నచ్చడం లేదని తను భర్త నుండి విడాకులు తీసుకుంటుందని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ నుండి ఎటువంటి స్పందన రాలేదు. అయితే తాజాగా నిహారికతో కలిసి ఉన్న ఫొటోను ఆమె భర్త చైతన్య షేర్ చేశాడు. దీంతో ఇద్దరూ కలసి మెలసి ఉంటున్నారని.. విడాకులు తీసుకోవడం లేదనే విషయంపై కాస్త క్లారిటీ వచ్చింది. అయితే తాజాగా నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లిపై కూడా చాలా కథనాలు వస్తున్నాయి.

వరుణ్ ఓ హీరోయిన్‌తో సీరియస్ రిలేషన్ షిప్ లో ఉన్నాడని, ఆమెనే పెళ్లి చేసుకుంటాడనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదిలా ఉండగా మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో తాజాగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. కూతురు నిహారిక ఇన్ స్టా అకౌంట్‌ను ఎందుకు డిలీట్ చేసిందని ఓ నెటిజన్ అడగగా నిహారిక ఇన్ స్టా అకౌంట్‌ను తానే స్వయంగా డిలీట్ చేశాను అని నాగబాబు సమాధానం ఇచ్చారు. అందుకు తాను కంప్యూటర్ ప్రోగ్రామింగ్ నేర్చుకున్నానని హాస్యాస్పదంగా చెప్పారు.
ఇక వరుణ్ తేజ్ పెళ్లి వార్తలపై కూడా ఆయన స్పందించారు. వరుణ్ తేజ్ పెళ్లి ఎప్పుడు అని ఓ నెటిజన్ అడగగా అతనినే అడగండి అని సమాధానం ఇచ్చారు. నాగబాబు మాటలను బట్టి చూస్తే వరుణ్ తన ఇష్టప్రకారం ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు.. అనే తీరుగానే ఉన్నాయి.
ఇక వరుణ్ తేజ్ ప్రస్తుతం గని సినిమాను తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. సునీల్ శెట్టి, జగపతి బాబు, ఉపేంద్ర తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.