Vastu Tips : ఆర్థిక ఇబ్బందులతో బాధపడే వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. ఎంత కష్టపడినా డబ్బులు మిగలకా ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. రోజంతా కష్టపడి సంపాదించి కూడబెట్టిన్న ధనమంతా ఏదో ఒక అవసరం వచ్చి ఖర్చైపోతూ ఉంటుంది. అవసరానికి డబ్బు అందక, అప్పులు ఎక్కువై సతమతమైపోతున్న వారు మనలో చాలా మంది ఉండే ఉంటారు. మన ఇంటి వాస్తూ కూడా ఇలా ఆర్థిక సమస్యలు రావడానికి ఒక కారణం కావచ్చని నిపుణులు చెబుతున్నారు. డబ్బూ అందరూ సంపాదిస్తారు కానీ దానిని నిలుపుకునే వారు కొద్ది మంది మాత్రమే ఉంటారు.
ఈ సమస్యకు సరైన ఆర్థిక ప్రణాళిక లేకపోవడం, దుబారా ఖర్చు చేయడంతో పాటు వాస్తు దోషాలు కూడా కారణం అవుతాయి. ఇంట్లో ఉండే వస్తువులు వాస్తుకు తగినట్టు ఆయా దిశలో ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో భాగంగా సంపద దేవుడైన కుబేరుడిని ప్రసన్నం చేసుకోవాలి. ఆయన మన్నించినప్పుడు సంపద, అదృష్టం ఆయన భక్తులపై కురిపించబడతాయి. ఉత్తరం కుబేరునికి మంచి స్థానం. కాబట్టి ఈ ప్రదేశాన్ని ఎనర్జిటిక్ గా, పాజిటివ్ గా ఉంచుకోవాలి. ఇది సంపద పెరగడానికి సహాయపడుతుంది. అలాగే ఈశాన్య దిశలో ఎటువంటి నిర్మాణాలు చేపట్టకూడదు. ఈశాన్య దిశలో గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. అలాగే ఈ దిశలో ఎటువంటి అడ్డంకులు ఉండకూడదు.
అలాగే చెత్తా చేదారాలను ఉంచకూడదు. ఈశాన్య దిశ సిరిసంపదలకు అనుకూలిస్తుంది. అదేవిధంగా ఇంటిని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చెత్తా చెదాలరాలను, అనవసర వస్తువులను పారేస్తూ ఉండాలి. ఇంటి ప్రధాన ద్వారానికి ఎటువంటి స్థంభాలు అడ్డుగా ఉండకుండ చూసుకోవాలి. విద్యుత్ వైర్లతో కూడిన పోల్స్ ఉండకుండ చూసుకోవాలి. అలాగే ఈశాన్య దిశలో బరువులు, నీటి ట్యాంక్ లు ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేయడం వల్ల దరిద్రం తొలగిపోతుంది. ఇంట్లో డబ్బుకు లోటు ఉండకుండా ఉంటుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి.