Vastu Tips : ఉదయం నిద్ర లేచిన వెంటనే చాలా మంది అనేక రకాల పనులను చేస్తుంటారు. కొందరు బెడ్ మీద ఉండే కాఫీ, టీ వంటివి తాగుతుంటారు. ఇంకొందరు న్యూస్ పేపర్ తిరగేస్తారు. ఇంకొందరు వెంటనే ఫోన్ అందుకుని తమకు వచ్చిన కాల్స్ లేదా మెసేజ్‌లు, మెయిల్స్ చెక్ చేస్తారు. తరువాత వెంటనే ఇతర పనులను మొదలు పెడతారు. అయితే చాలా మంది ఉదయం నిద్ర లేవగానే కామన్‌గా చేసే పని ఒకటి ఉంది. అదే.. అద్దంలో తమ ముఖాన్ని చూసుకోవడం. అవును, ఉదయం చాలా మంది ఇలా చేస్తారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం వాస్తవానికి ఇలా చేయడం మంచిది కాదట. దీంతో అన్నీ సమస్యలనే ఎదుర్కోవాల్సి వస్తుందట. ఇంకా ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయం నిద్ర లేచిన వెంటనే అద్దంలో మన ముఖాన్ని చూసుకోకూడదు. దీంతో జీవితంలో సమస్యలు పెరుగుతాయని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అందువల్లే బెడ్ రూమ్‌లో బెడ్ ఎదురుగా నిలువైన అద్దం ఉండకూడదని అంటుంటారు. ఇక ఉదయాన్నే అద్దంలో ముఖాన్ని చూడడం అంత మంచిది కాదు. రాత్రి మనం నిద్రించే సమయంలో అద్దం చుట్టూ ప్రతికూల శక్తులు ఉంటాయి. ఈ క్రమంలో ఉదయాన్నే మనం నిద్ర లేచిన వెంటనే మన ముఖాన్ని అద్దంలో చూసుకోవడం వల్ల ఈ ప్రతికూల శక్తులు మనల్ని ప్రభావితం చేస్తాయి. దీంతో మనకు అన్నీ సమస్యలే వస్తాయి. ఆ రోజు ఏం పని చేసినా ఆటంకమే ఏర్పడుతుంది.
ఉదయం నిద్ర లేవగానే అద్దంలో ముఖాన్ని చూడడం వల్ల ముఖంపై సహజంగానే మొటిమలు, ముడతలు, నెరిసిన జుట్టు, మచ్చలు కనిపిస్తాయి. ఇవి మన ఆత్మ విశ్వాసాన్ని దెబ్బ తీస్తాయి. దీంతో రోజంతా నెగెటివ్ ఫీలింగ్‌లోకి వెళ్లిపోతారు. ఏం చేయబుద్ది కాదు. ఆత్మవిశ్వాసం సన్నగిల్లిపోతుంది. వాస్తు ప్రకారం ఉదయం అద్దంలో ముఖాన్ని చూడడం వల్ల తమ నీడను తామే చూసుకున్నంత అశుభం కలుగుతుందట. అలాగే మానసిక ఉద్రిక్తత పెరుగుతుంది. నెగెటివ్ శక్తి వస్తుంది. అందువల్ల ఉదయాన్నే అద్దంలో ముఖాన్ని చూడకూడదు.