Veg Dum Biryani : రెస్టారెంట్‌ల‌లో చేసిన‌ట్లు వెజ్ ద‌మ్ బిర్యానీ.. ఇంట్లోనే ఇలా సుల‌భంగా వండేయండి..!

Veg Dum Biryani : మ‌న‌కు రెస్టారెంట్ ల‌లో ల‌భించే వివిధ ర‌కాల బిర్యానీల‌లో వెజ్ ద‌మ్ బిర్యానీ కూడా ఒక‌టి. ఈ బిర్యానీ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. చికెన్, మ‌ట‌న్ బిర్యానీల‌కు ఏ మాత్రం త‌క్కువ పోని ఈ వెజ్ ద‌మ్ బిర్యానీని మ‌నం కూడా చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. దీనిని త‌యారు చేయ‌డం చాలా సుల‌భం. వీకెండ్స్ లో, స్పెష‌ల్ డేస్ లో ఇలా వెజ్ ద‌మ్ బిర్యానీని త‌యారు చేసి తీసుకోవ‌చ్చు. రెస్టారెంట్ స్టైల్ వెజ్ ద‌మ్ బిర్యానీని ఎలా త‌యారు చేసుకోవాలి.. త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాల గురించి… ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీకి కావల్సిన ప‌దార్థాలు..

నెయ్యి – 3 టేబుల్ స్పూన్స్, నీళ్లు – 50 ఎమ్ ఎల్, గ‌రం మ‌సాలా – పావు టీ స్పూన్, పాల‌ల్లో నాన‌బెట్టిన కుంకుమ పువ్వు – 2 టేబుల్ స్పూన్స్, కొత్తిమీర – ఒక టీ స్పూన్, వేయించిన ఉల్లిపాయ‌లు – ఒక టేబుల్ స్పూన్.

Veg Dum Biryani recipe make like this at home
Veg Dum Biryani

మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

ముక్క‌లుగా త‌రిగిన బంగాళాదుంప – 1, త‌రిగిన క్యారెట్ – 1, త‌రిగిన ఫ్రెంచ్ బీన్స్ – 6, ఉప్పు – కొద్దిగా, ప‌సుపు – పావు టీ స్పూన్, క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు – 10 నుండి 15, వేడి నీటిలో నాన‌బెట్టిన తాజా బ‌ఠాణీ – గుప్పెడు, ఫ్రైడ్ ఆనియ‌న్స్ – పావు క‌ప్పు, కొత్తిమీర త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, పుదీనా త‌రుగు – 2 టేబుల్ స్పూన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, సాజీరా – ఒక టీ స్పూన్, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క‌, యాల‌కులు – 4, ల‌వంగాలు – 4, బిర్యానీ ఆకు – 1, కారం – ఒక టేబుల్ స్పూన్, వేయించిన జీల‌క‌ర్ర పొడి – ఒక టీ స్పూన్, గ‌రం మ‌సాలా – ఒక టీ స్పూన్, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2, ధ‌నియాల పొడి – ఒక టీ స్పూన్, నిమ్మ‌కాయ – 1, క‌మ్మ‌టి పెరుగు – అర క‌ప్పు, , నూనె – 2 టేబుల్ స్పూన్స్, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.

అన్నం త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

నీళ్లు – 2 లీట‌ర్లు, సాజీరా – ఒక టీ స్పూన్, ల‌వంగాలు – 5, యాల‌కులు – 5, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క‌, బిర్యానీ ఆకు – 1, న‌ల్ల యాల‌క్కాయ – 1, అనాస పువ్వు – 1, ఉప్పు – త‌గినంత‌, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, గంట పాటు నాన‌బెట్టిన బాస్మ‌తీ బియ్యం – ఒక‌టిన్న‌ర క‌ప్పు, నిమ్మ‌కాయ – అర చెక్క‌, త‌రిగిన ప‌చ్చిమిర్చి – 2.

వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యారీ విధానం…

ముందుగా గిన్నెలో నీటిని తీసుకోవాలి. త‌రువాత బంగాళాదుంప ముక్క‌లు, క్యారెట్, బీన్స్, క్యాలీప్ల‌వ‌ర్ ముక్క‌లు వేసుకోవాలి. త‌రువాత ఉప్పు, ప‌సుపు వేసి ఈ ముక్క‌ల‌ను 70 శాతం ఉడికించాలి. ముక్క‌లు ఉడికిన త‌రువాత వీటిని గిన్నెలోకి తీసుకుని చ‌ల్ల‌టి నీళ్లు పోయాలి. త‌రువాత ఈ ముక్క‌ల‌ను వ‌డ‌క‌ట్టి అడుగు మందంగా ఉండే గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మ‌సాలా త‌యారీకి కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు, ప‌సుపు వేసి క‌ల‌పాలి. మ‌సాలా అంతా ముక్క‌ల‌కు ప‌ట్టించిన త‌రువాత గిన్నెను ప‌క్కకు ఉంచాలి. త‌రువాత మ‌రో గిన్నెలో నీటిని తీసుకోవాలి. ఇందులో బియ్యం త‌ప్ప అన్నం త‌యారీకి కావ‌ల్సిన మిగిలిన ప‌దార్థాల‌న్నీ వేసి క‌ల‌పాలి. ఈ గిన్నెను స్ట‌వ్ మీద ఉంచి నీటిని మ‌రిగించాలి.

నీళ్లు మ‌రిగిన త‌రువాత బియ్యం వేసి క‌ల‌పాలి. ఈ బియ్యాన్ని 70 శాతం ఉడికించిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి బియ్యాన్ని వ‌డ‌క‌ట్టి ముందుగా సిద్దం చేసుకున్న కూర‌గాయ‌ల మిశ్ర‌మంపై వేసుకుని పైన స‌మానంగా చేసుకోవాలి. త‌రువాత గిన్నె అంచుల వెంబ‌డి 50 ఎమ్ ఎల్ బియ్యం ఉడికించిన నీటిని పోసుకోవాలి. త‌రువాత పైన నెయ్యి, ఫ్రైడ్ ఆనియ‌న్స్, కొత్తిమీర‌, కుంకుమ పువ్వు, గ‌రం మ‌సాలా చ‌ల్లుకోవాలి. దీనిపై టిష్యూ పేప‌ర్ ల‌ను వేసి పైన నీటిని చ‌ల్లుకోవాలి. త‌రువాత ఆవిరి బ‌య‌ట‌కు పోకుండా మూత పెట్టి గిన్నెను స్ట‌వ్ మీద ఉంచాలి. దీనిని 7 నిమిషాల పాటు మ‌ధ్య‌స్థ మంట‌పై 8 నిమిషాల పాటు చిన్న మంట‌పై ద‌మ్ చేసుకుని స్ట‌వ్ ఆఫ్ చేసుకోవాలి. త‌రువాత దీనిని మ‌రో 15 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ త‌రువాత స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ద‌మ్ బిర్యానీ త‌యార‌వుతుంది. దీనిని మిర్చి క సాల‌న్ తో తింటే మ‌రింత రుచిగా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ద‌మ్ బిర్యానీని అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts