Kamanchi Kayalu : రోడ్డు ప‌క్క‌న మ‌న‌కు క‌నిపించే ఈ మొక్క కాయ‌ల‌ను విడిచిపెట్ట‌కుండా ఇంటికి తెచ్చుకోండి.. ఇవి బంగారంతో స‌మానం..!

Kamanchi Kayalu : మ‌న‌కు రోడ్ల వెంబ‌డి, పొలాల గట్ల మీద, చేల‌ల్లో ల‌భించే వివిధ ర‌కాల మొక్క‌ల‌ల్లో కామంచి మొక్క కూడా ఒక‌టి. దీనిని ఇంగ్లీష్ లో మాకోయ్ అని పిలుస్తారు. ఈ మొక్క‌కు ఊదా రంగులో మ‌రియు ఎరుపు రంగులో గుత్తులు గుత్తులుగా కాయ‌లు కూడా ఉంటాయి. ఈ కాయ‌ల‌ను చాలా మంది ఇష్టంగా తింటారు. అలాగే వంట‌లు కూడా త‌యారు చేస్తారు. అయితే చాలా మంది దీనిని క‌లుపు మొక్క‌గానే భావిస్తారు. కానీ కామంచి మొక్క కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు క‌లుగుతుంద‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ కాయ‌ల‌ల్లో ఎన్నో పోష‌కాలు, ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు దాగి ఉన్నాయ‌ని వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం చ‌క్క‌టి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవ‌చ్చ‌ని వారు చెబుతున్నారు. కామంచి మొక్క కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ఆరోగ్య ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ బ‌ల‌ప‌డుతుంది. బ్యాక్టీరియా, వైర‌స్ ల వ‌ల్ల క‌లిగే ఇన్పెక్ష‌న్ ల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఇవి యాంటీ ఇన్ ప్లామేట‌రీ ల‌క్ష‌ణాలను కూడా క‌లిగి ఉంటుంది. శ‌రీరంలో మంట‌ను త‌గ్గించ‌డంలో, నొప్పుల‌ను, వాపుల‌ను త‌గ్గించ‌డంలో ఈ కాయ‌లు మ‌న‌కు స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే కామంచి కాయ‌ల‌ల్లో హెపాటోప్రొటెక్టివ్ ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయి. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో ఈ కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. కాలేయ సంబంధిత స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డే వారికి ఇవి ఒక వ‌ర‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

Kamanchi Kayalu many wonderful benefits in telugu
Kamanchi Kayalu

అలాగే క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా కాపాడ‌డంలో కూడా కామంచి మొక్క కాయ‌లు మ‌న‌కు దోహ‌ద‌ప‌డ‌తాయి. ఈ కాయ‌ల‌ల్లో క్యాన్స‌ర్ నిరోధిత ల‌క్ష‌ణాలు ఎక్కువ‌గా ఉన్నాయి. క్యాన్స‌ర్ క‌ణాలు పెర‌గ‌కుండా నిరోధించ‌డంలో, క‌ణితి ఏర్ప‌డ‌కుండా చేయ‌డంలో ఈ కాయ‌లు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఈ కాయ‌ల‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉంటాయి. ఇవి క‌ణాల ఆక్సీక‌ర‌ణ ఒత్తిడిని త‌గ్గించ‌డంలో, ఫ్రీరాడికల్స్ నుండి క‌ణాల‌ను కాపాడ‌డంలో దోహద‌ప‌డ‌తాయి. కామంచి మొక్క కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ ఎక్కువగా అందుతుంది. కంటి చూపు మెరుగుప‌డుతుంది. దృష్టి లోపాలు తొల‌గిపోతాయి. అలాగే ఈ కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం అందంగా, కాంతివంతంగా త‌యార‌వుతుంది.

ఇక షుగ‌ర్ వ్యాధితో బాధ‌ప‌డే వారు కామంచి కాయ‌ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ర‌క్తంలో చ‌క్కెర స్థాయిల‌ను అదుపులో ఉంచ‌డంలో ఇవి మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి. అదేవిధంగా గుండె ఆరోగ్యాన్ని కాపాడ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో, కొలెస్ట్రాల్ ను త‌గ్గించ‌డంలో కూడా ఈ కాయ‌లు దోహ‌ద‌ప‌డ‌తాయి. అలాగే ప్రేగులల్లో శుభ్ర‌మైన వాతావ‌ర‌ణాన్ని ఉంచ‌డంలో, జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌ర‌చ‌డంలో, మ‌ల‌బ‌ద్ద‌కం, అజీర్తి వంటి స‌మ‌స్య‌ల‌ను త‌గ్గించ‌డంలో కూడా కామంచి కాయ‌లు మ‌న‌కు తోడ్ప‌డ‌తాయి. ఈ విధంగా పిచ్చి మొక్క‌గా భావించే కామంచి మొక్క కాయ‌లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఇవి దొరికిన‌ప్పుడు వీటిని తీసుకునే ప్ర‌య‌త్నం చేయాల‌ని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.

Share
D

Recent Posts