Veg Omelette : వెజ్ ఆమ్లెట్ త‌యారీ ఇలా.. ఎంతో రుచిగా ఉంటుంది..!

Veg Omelette : కోడిగుడ్ల‌తో చేసుకోద‌గిన చిరుతిళ్ల‌ల్లో ఆమ్లెట్ కూడా ఒక‌టి. ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పిల్ల‌లు, పెద్ద‌లు అనే తేడా లేకుండా అంద‌రూ దీనిని ఇష్టంగా తింటారు. సైడ్ డిష్ గా తిన‌డానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. అయితే కోడిగుడ్లు లేక‌పోయినా కూడా మ‌నం ఆమ్లెట్ ను త‌యారు చేసుకోవ‌చ్చు. కంద‌దుంప‌తో చేసే ఈ వెజ్ ఆమ్లెట్ చాలా రుచిగా ఉంటుంది. పైన క్రిస్పీగా లోప‌ల మెత్త‌గా ఉండే ఈ వెజ్ ఆమ్లెట్ ను చాలా సుల‌భంగా త‌యారు చేసుకోవ‌చ్చు. ఒక్కసారి దీనిని రుచి చూస్తే మ‌ళ్లీ మ‌ళ్లీ ఇదే కావాల‌ని అడుగుతారు. ఎంతో రుచిగా, క‌మ్మ‌గా ఉండే ఈ వెజ్ ఆమ్లెట్ ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వెజ్ ఆమ్లెట్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

కంద‌దుంప – మ‌ధ్య‌స్థంగా ఉన్న‌ది ఒక‌టి, అర‌గంట పాటు నాన‌బెట్టిన ఎండుమిర్చి – 10 లేదా త‌గిన‌న్ని, ఉప్పు – త‌గినంత‌, అల్లం – ఒక ఇంచు ముక్క‌, క‌రివేపాకు – ఒక రెమ్మ‌, జీల‌కర్ర – అర టీ స్పూన్, ప‌సుపు – చిటికెడు, ఇంగువ – పావు టీ స్పూన్, బియ్యం పిండి – పావు క‌ప్పు, త‌రిగిన కొత్తిమీర – కొద్దిగా, త‌రిగిన ఉల్లిపాయ – 1.

Veg Omelette recipe in telugu make in this method
Veg Omelette

వెజ్ ఆమ్లెట్ త‌యారీ విధానం..

ముందుగా కంద దుంప‌కు ఉండే చెక్కును తీసేసి శుభ్రంగా క‌డ‌గాలి.త‌రువాత ఈ దుంప‌ను తురుముకుని ఉప్పు నీటిలో వేసుకోవాలి. ఉప్పు నీటిలో శుభ్రంగా క‌డిగి నీటిని పిండేసి మ‌ర‌లా మంచి నీటిలో వేసుకోవాలి. దీనిని మ‌రోసారి క‌డిగి నీటిని పిండేసి గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత రోట్లో ఎండుమిర్చి, ఉప్పు, అల్లం వేసి దంచుకోవాలి. త‌రువాత కంద తురుమును వేసి క‌చ్చా ప‌చ్చాగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. త‌రువాత మిగిలిన ప‌దార్థాల‌ను వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద చిన్న క‌ళాయిని ఉంచి వేడి చేయాలి.

క‌ళాయి వేడ‌య్యాక కంద మిశ్ర‌మాన్ని ఉంచి క‌ళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. త‌రువాత అంచుల చుట్టు నూనె వేసి చిన్న మంట‌పై ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకోవాలి. త‌రువాత మ‌రో వైపుకు తిప్పుకుని కాల్చుకోవాలి. మ‌ర‌లా అంచుల చుట్టూ నూనె వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వెజ్ ఆమ్లెట్ త‌యార‌వుతుంది. సైడ్ డిష్ గా, స్నాక్స్ గా తినడానికి ఇది చాలా చ‌క్క‌గా ఉంటుంది. ఈ విధంగా త‌యారు చేసిన ఈ వెజ్ ఆమ్లెట్ ను అంద‌రూ ఎంతో ఇష్టంగా తింటారు.

D

Recent Posts