Viral Video : ప్రమాదాలు అనేవి మనకు చెప్పి జరగవు. ఊహించకుండానే జరుగుతాయి. ఇలాంటి సందర్భాల్లో బతికి బట్ట కట్టడం అంటే చాలా తక్కువే అని చెప్పాలి. ప్రమాదాల్లో గాయపడి చాలా మంది చనిపోతుంటారు. అదృష్టం బాగుండి బతికిపోయేవారు తక్కువగానే ఉంటారు. అయితే ఆ మహిళ కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుందని చెప్పవచ్చు. ఓ ట్రక్కు ఆమె వాహనాన్ని ఢీకొన్నా.. ఆమె స్వల్ప గాయాలతో బయట పడింది. ఈ సంఘటన మణిపాల్‌లో చోటు చేసుకుంది.
మణిపాల్‌లోని పేరంపల్లి అనే ప్రాంతంలో ఓ మహిళ తన ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతోంది. అయితే అదే సమయంలో ఆమె ఉన్న వైపు ఓ బస్సు వచ్చి ఆగింది. దీంతో దాని పక్కనే వస్తున్న ట్రక్కును ఆమె చూడలేదు. ఒక్కసారిగా తమ తన వాహనాన్ని రోడ్డు మీదకు పోనిచ్చింది. అదే సమయంలో బస్సు పక్క నుంచే వచ్చిన ఓ ట్రక్కు ఆమెను ఢీకొంది. దీంతో ఆమె వాహనంతో సహా గాల్లో ఎగిరి పడింది.
CCTV footage captures the miraculous escape of a woman after being hit by a truck transporting milk in Perampalli near Manipal on Tuesday.
The woman crossing the road has survived with only minor injuries.
???? Wear helmets, ride safely! ???????? pic.twitter.com/Qowng4ces3
— Mangalore City (@MangaloreCity) March 12, 2022
అయితే అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా ఆమె స్వల్ప గాయాలతోనే బయట పడింది. ఆమెకు అదృష్టం బాగుందనే చెప్పాలి. యాక్సిడెంట్ జరగ్గానే ఆమె లేచి నిలుచోగా.. చుట్టూ ఉన్నవారు హుటాహుటిన వచ్చి ఆమెను రహదారి పక్కకు తీసుకువచ్చి ప్రథమ చికిత్స చేశారు. నీళ్లను అందించారు. అయితే ఆమెను ఢీకొట్టిన ట్రక్కు వివరాలు తెలియవని పోలీసులు తెలిపారు.
ఇలా ఆ మహిళ తన లక్‌తో ఆ ప్రమాదం నుంచి బయట పడింది. ఇక ఈ ఘటన తాలూకు దృశ్యాలు అక్కడే ఉన్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో ఆ వీడియో వైరల్‌గా మారింది. ఆ మహిళకు అదృష్టం బాగుందని నెటిజన్లు అంటున్నారు.