Health Tips : తేనె.. కిస్మిస్.. వీటిని సహజంగానే చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. కిస్మిస్‌లతో ప్రత్యేక వంటలను చేసుకుని తింటుంటారు. ముఖ్యంగా వీటితో తీపి వంటకాలను చేస్తుంటారు. ఇక తేనెను కూడా పలు విధాలుగా మనం రోజూ ఉపయోగిస్తూనే ఉంటాం. అయితే కిస్మిస్‌లలో ఐరన్, కాపర్ అధికంగా ఉంటాయి. అలాగే అమైనో ఆమ్లాలు, నియాసిన్, విటమిన్ బి6, రైబోఫ్లేవిన్, విటమిన్ సి వంటి పోషకాలు తేనెలో ఎక్కువగా ఉంటాయి. ఇక ఈ రెండింటినీ కలిపి ఒక ప్రత్యేకమైన సమయంలో తీసుకుంటే అనేక లాభాలు కలుగుతాయి.
ఆయుర్వేదం చెబుతున్న ప్రకారం కిస్మిస్‌లు, తేనెను కలిపి తినడం వల్ల పురుషుల్లో టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ అధికంగా ఉత్పత్తి అవుతుంది. దీంతో పురుషుల్లో ఉండే శృంగార సమస్యలు పోతాయి. శృంగార సామర్థ్యం పెరుగుతుంది. అయితే అందుకు గాను ఈ రెండింటినీ పురుషులు ఒక ప్రత్యేకమైన సమయంలో తీసుకోవాల్సి ఉంటుంది.
300 గ్రాముల కిస్మిస్‌లను ఒక గ్లాస్ పాత్రలో వేయాలి. అనంతరం అందులో తేనె పోయాలి. సరిపడా తేనె పోసిన తరువాత మూత పెట్టేయాలి. అయితే కిస్మిస్‌లు మునిగేలా తేనె పోయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో తేనెలో కిస్మిస్‌లను అలాగే కొంత సేపు నానబెట్టాలి. ఇక కొన్ని గంటల తరువాత ఆ మిశ్రమాన్ని బయటకు తీసి పేస్ట్‌లా చేయాలి. దీన్ని మళ్లీ 48 గంటల పాటు అలాగే ఉంచాలి. దీంతో తేనె, కిస్మిస్‌ల మిశ్రమం రెడీ అవుతుంది.
ఇక ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని 5 గ్రాముల మోతాదులో తీసుకుని దాన్ని ఉదయాన్నే పరగడుపునే తినాలి. తరువాత 30 నిమిషాల పాటు అలాగే ఉండాలి. ఏమీ తీసుకోరాదు. ఇలా రోజు ఈ మిశ్రమాన్ని పురుషులు తినాలి. దీంతో అనేక లాభాలు కలుగుతాయి.
ఇలా ఈ మిశ్రమాన్ని తయారు చేసుకుని రోజూ ఉదయాన్నే పరగడుపునే పురుషులు తింటే వారిలో శృంగార సమస్యలు పోయి శృంగార సామర్థ్యం పెరుగుతుంది. వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. దీంతో సంతాం కలిగే అవకాశాలు పెరుగుతాయి. అలాగే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఈ మిశ్రమం పురుషులకు ఎక్కువగా మేలు చేస్తుంది. వారిలో ఉండే హార్మోన్ సమస్యలు కూడా తగ్గుతాయి.