Water Tank On Home : సాధారణంగా మనలో చాలా మంది ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకుంటూ ఉంటారు. వాస్తు ప్రకారం ఇంటిని నిర్మించుకోవడం వల్ల అంతా మంచే జరుగుతుందని భావిస్తూ ఉంటారు. అయితే ఇంటి నిర్మాణంలోనే కాదు ఇంట్లో ఏర్పాటు చేసే ప్రతి వస్తువుకు కూడా వాస్తు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. ఇంటి గదులను, ద్వారాలను ఎలాగైతే వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకుంటామో ఇంట్లో ఉంచే ప్రతి వస్తువును కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇలా మనం ఇంట్లో ఉంచే వస్తువుల్లో వాటర్ ట్యాంక్ కూడా ఒకటి. వాటర్ ట్యాంక్ మనకు చాలా అవసరం. ఎవరి వీలును బట్టి వారు ఇంటి పైన అలాగే అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు.
ఇలా ఇంట్లో ఏర్పాటు చేసే వాటర్ ట్యాంక్ ను కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. లేదంటే మనం వివిధ దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు సూచిస్తూ ఉన్నారు. అయితే వాస్తు ప్రకారం వాటర్ ట్యాంక్ ను ఎలా ఏర్పాటు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. వాటర్ ట్యాంక్ ను ఎల్లప్పుడూ ఇంటికి నైరుతి దిశలోనే ఏర్పాటు చేసుకోవాలి. ఇది వీలు కాని పక్షంలో దక్షిణం వైపు ఏర్పాటు చేసుకోవాలి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యం దిక్కులో ఏర్పాటు చేసుకోకూడదు. వాటర్ ట్యాంక్ ను ఈశాన్యం వైపు ఉంచడం వల్ల వృదా ఖర్చులు ఎక్కువగా అవుతాయి. నష్టాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వాటర్ ట్యాంక్ ను ఇంటి మధ్యలో ఉంచకూడదు.
ఇలా చేయడం వల్ల ఇంటి యజమాని ఆరోగ్యం అంతా బాగుండదని నిపుణులు చెబుతున్నారు. అలాగే వాటర్ ట్యాంక్ ను వంటగదిపై కూడా ఉంచకూడదు. అదే విధంగా అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ను మాత్రం నైరుతి దిశలో ఏర్పాటు చేసుకోకూడదని నిపుణులు చెబుతున్నారు. అండర్ గ్రౌండ్ వాటర్ ట్యాంక్ ను ఈశాన్యం వైపు ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం వైపు నీరు నిల్వ ఉండడం వల్ల కుటుంబంలోని సభ్యులకు మేలు కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ విధంగా వాటర్ ట్యాంక్ ఏర్పాటు విషయంలో కూడా వాస్తు ప్రకారం తగిన జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు తెలియజేస్తున్నారు.