Watermelon Juice : పుచ్చకాయ‌తో జ్యూస్ త‌యారీ ఇలా.. చ‌ల్ల చ‌ల్ల‌గా తాగ‌వ‌చ్చు..!

Watermelon Juice : పుచ్చకాయ‌.. వేస‌వికాలంలో ఇది మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తుంది. పుచ్చకాయ‌ను ఎండ నుండి ఉప‌శ‌మ‌నం పొంద‌డానికి వేస‌వికాలంలో ఎక్కువ‌గా తింటూ ఉంటారు. పుచ్చకాయ‌ను తిన‌డం వ‌ల్ల డీహైడ్రేష‌న్ బారిన ప‌డ‌కుండా ఉంటాము. అంతేకాకుండా దీనిలో ఉండే పోష‌కాలు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. త‌ప్ప‌కుండా పుచ్చ‌కాయ‌ను ఆహారంగా తీసుకోవాల‌ని వైద్యులు కూడా సూచిస్తూ ఉంటారు. పుచ్చకాయ‌ను నేరుగా తిన‌డంతో పాటు దీనితో మ‌నం ఎంతో రుచిగా ఉండే జ్యూస్ ను కూడా త‌యారు చేసుకోవ‌చ్చు. ఈ జ్యూస్ ను త‌యారు చేసుకోవ‌డం పెద్ద క‌ష్ట‌మేమి కాదు. కేవ‌లం 5 నిమిషాల్లో చాల సుల‌భంగా చేసుకోవ‌చ్చు. చ‌ల్ల చ‌ల్ల‌గా అంద‌రికి న‌చ్చేలా పుచ్చకాయ‌తో జ్యూస్ ను ఎలా త‌యారు చేసుకోవాలి.. అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం.

వాట‌ర్ మెల‌న్ జ్యూస్ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

గింజ‌లు తీసేసిన పుచ్చ‌కాయ ముక్క‌లు -3 పెద్ద క‌ప్పులు, కొబ్బ‌రి బోండం నీళ్లు – 300 ఎమ్ ఎల్, పంచ‌దార – 2 టీ స్పూన్స్, ఐస్ క్యూబ్స్ – అర క‌ప్పు.

Watermelon Juice recipe in telugu make in this method
Watermelon Juice

వాట‌ర్ మెల‌న్ జ్యూస్ త‌యారీ విధానం..

ముందుగా బ్లెండ‌ర్ లో పుచ్చ‌కాయ ముక్క‌లు, కొబ్బ‌రి నీళ్లు, పంచ‌దార‌, ఐస్ క్యూబ్స్ వేసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ జ్యూస్ ను గ్లాస్ లో పోసుకుని స‌ర్వ్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే వాట‌ర్ మెల‌న్ జ్యూస్ త‌యార‌వుతుంది. ఇందులో పంచ‌దారకు బ‌దులుగా తేనెను కూడా వేసుకోవ‌చ్చు. ఈ విధంగా త‌యారు చేసుకున్న జ్యూస్ ను తాగ‌డం వ‌ల్ల రుచి రుచిని ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని పొంద‌వ‌చ్చు. వేస‌వికాలంలో ఈ జ్యూస్ ను త‌యారు చేసుకుని తాగ‌డం వ‌ల్ల ఎండ నుండి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఎండ వ‌ల్ల శ‌రీరం కోల్పోయిన పోష‌కాలు తిరిగి అందుతాయి.

Share
D

Recent Posts