మ‌ర‌ణించిన బంధువులు క‌ల‌లో క‌నిపిస్తే.. ఏం జ‌రుగుతుందో తెలుసా..?

నిద్ర‌లో ఉన్న‌ప్పుడు మ‌న చుట్టూ ఏం జ‌రుగుతుందో తెలియ‌దు. గాఢ నిద్రలో మాత్రం అప్పుడ‌ప్పుడూ క‌ల‌లు కంటూ ఉంటాం. క‌ల‌లు అంటే అది ఒక వింత ప్ర‌పంచం. మ‌న‌కు వ‌చ్చే క‌ల‌ల‌ను చాలా వ‌ర‌కు ప‌ట్టించుకోము. కొంద‌రు త‌మ‌కు వ‌చ్చిన క‌ల‌ను గుర్తుంచుకుంటారు. కొంద‌రికి క‌ల‌ను గుర్తుంచుకునే శక్తి ఉండ‌దు. ఏ క‌ల‌కు కూడా ప్ర‌త్యేక‌మైన ముగింపు ఉండ‌దు. మ‌ధ్య‌లో అర్థాంత‌రంగా ఆగిపోతాయి. కొన్నిసార్లు మ‌నం మ‌రిచిపోయిన వ్య‌క్తులు కూడా క‌ల‌లో వ‌స్తూ ఉంటారు. క‌ల‌ల‌పై ఎప్పుడూ ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతూనే ఉంటాయి. క‌ల‌లు కొంద‌రికి రంగుల్లో క‌నిపిస్తాయి. కొంద‌రికి నలుపు మ‌రియు తెలుపు రంగుల్లో క‌నిపిస్తాయి.

మ‌ర‌ణించిన ఆత్మీయులు, మిత్రులు, బంధువులు కూడా మ‌న క‌ల‌లో క‌నిపిస్తూ ఉంటారు. ఆత్మీయులు క‌ల‌లో క‌నిపిస్తే మాత్రం ఎంతో బాధ క‌లుగుతుంది. ఒక్కోసారి భ‌యం కూడా క‌లుగుతుంది. గ‌తించిన మ‌న ఆత్మీయులు క‌ల‌లో క‌నిపిస్తే సాధార‌ణంగా పూర్తి ఆరోగ్యంగా క‌న‌బ‌డ‌తారు. అనారోగ్యంతో మ‌ర‌ణించిన మ‌న బంధువులు సంపూర్ణ ఆరోగ్యవంతులుగా మ‌న ముందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతారు. వారిలో ఉన్న అనారోగ్యాలు క‌న‌బ‌డ‌వు. ముందు ఉన్న దాని కంటే య‌వ్వ‌నంగా క‌న‌బ‌డ‌తారు. ఆత్మీయులు క‌ల‌లో క‌నిపిస్తే విసిటేష‌న్ డ్రీమ్స్ అంటారు. అయితే దీనికి మాన‌సిక, ఆధ్యాత్మిక కార‌ణాలు ఉన్నాయి. ఇందులో మాన‌సిక కార‌ణాలు 30 శాతం ఉంటే ఆధ్యాత్మిక కార‌ణాలు 70 శాతం ఉంటాయి. కుటుంబంలోని ప్రియ‌మైన వ్య‌క్తి చ‌నిపోతే మ‌నసులో కాస్త ఆందోళ‌నగా ఉంటుంది.

what happens if death persons come in dreams

అలాగే బ్ర‌తికున్నప్పుడు వారితో ఎక్కువ‌గా గ‌డ‌ప‌లేద‌ని, గౌర‌వం ఇవ్వ‌లేద‌ని అపారాధం, విచార‌ణ క‌లిగించే అనుభూతికి గురి కావ‌డం మాన‌సిక కార‌ణం. ఇలాంటివి మ‌న‌సులో ఉంటే అచేత‌నంగా ఉన్న‌ప్పుడు వారు క‌ల‌లో క‌నిపిస్తారు. అలాగే ఆధ్యాత్మికంగా రెండు కార‌ణాలు ఉన్నాయి. మ‌ర‌ణించిన ఆత్మీయులు మ‌న క‌ష్టాల్లో ఉన్న‌ప్పుడు మ‌న‌కు స‌హాయం చేస్తారు. వివిధ సంద‌ర్భాల్లో మ‌న‌ల్ని కాపాడే ప్ర‌య‌త్నం చేస్తార‌ట‌. కొంద‌రు మాత్రం ప‌గ సాధించాల‌ని చూస్తార‌ట‌. ఆధ్యాత్మిక ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం 60 శాతం మంది మ‌న‌కు స‌హ‌క‌రిస్తే కేవ‌లం 30 శాతం మంది ప‌గ సాధిస్తారు. మిగిలిన 5 శాతం మంది వారి వార‌సుల‌కు స‌ల‌హా ఇస్తారు. ఈ క‌ల ద్వారా మ‌న ఆత్మీయులు మ‌న‌కు సందేశం ఇవ్వాల‌ని అనుకుంటారు. అది కూడా ఎక్కువ సంద‌ర్భాల్లో శుభ‌వార్తే చెబుతారు.

పైలోకాల్లో ప్ర‌శౄంతంగా ఉన్నామ‌ని స‌మాచార‌ని కూడా ఇస్తారు. ఇలాంటి క‌ల‌ల గురించి భ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కానీ అప్పుడ‌ప్పుడు జ‌రిగే ప్ర‌మాదాల గురించి ముందే హెచ్చ‌రించ‌డానికి కూడా ఆత్మీయులు క‌ల‌లో వ‌స్తూ ఉంటార‌ట‌. ఒకే క‌ల క‌నీసం మూడు సార్లు పునారావృతం అయితే దాన్ని ఆధ్యాత్మికంగా ప‌రిగ‌ణిస్తారు. మ‌ర‌ణించిన ఆత్మీయులు సాధార‌ణంగా కుంటుంబ సభ్యుల‌ను సంప్ర‌దించ‌డానికి ప్ర‌య‌త్నిస్తారు లేదా క‌ల‌లో ద‌ర్శ‌న‌మిస్తారు. వీళ్లు త‌మ వారికి ఏదో చేయాల‌ని భావిస్తారు. చ‌నిపోయిన వ్యక్తులు క‌ల‌ల ద్వారా సంభాషించ‌డానికి వీలువుతుంద‌నేది ఆధ్యాత్మిక గురువుల విశ్లేష‌ణ‌. మేల్కొనే స‌మ‌యంలో సంప్ర‌దించ‌డానికి వారు ప్ర‌య‌త్నించిన ఆ భావాల‌ను మ‌నం అర్థం చేసుకోలేము. వారిని మ‌న సాధార‌ణ రెండు క‌ళ్ల‌తో చూడ‌లేము. అందుకే నిద్రావ‌స్థ‌లో ఉన్న‌ప్పుడు క‌ల‌లో క‌నిపించి మ‌న‌సుతో సంభాషించి సందేశాల‌ను ఇస్తారు.

D

Recent Posts