lifestyle

తిరుమ‌ల‌లో మ‌నం ఇచ్చే జుట్టుని వారు ఏం చేస్తారు..?

గ‌త రెండు రోజులుగా తిరుమ‌ల ల‌డ్డూ వివాదం ఎంత ప్ర‌కంప‌న‌లు రేపుతుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఆరోపణల నేపథ్యంలో గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌ల వ‌ర్షం కురుస్తుంది.అయితే భక్తుల పాలిట కొంగు బంగారంగా, కోరిన కోర్కెలు తీర్చే కలియుగ ప్రత్యక్ష దైవం ఏడుకొండలవాడికి తలనీలాలు సమర్పిస్తూ ఉంటారు. ఏటా లక్షలాది మంది తిరుమల వెంకన్నకు మొక్కు చెల్లించుకుంటారు, స్వామికి కొండపై కల్యాణకట్ట దగ్గర తలనీలాలు సమర్పిస్తారు.ఇలా తలనీలాలు ఇస్తామని మొక్కుకుంటే ఆ కోరిక తీరుతుందని ఓ నమ్మకం. ఈ క్రమంలో సుమారు 500 నుండి 600 టన్నుల వెంట్రుకలను విరాళంగా అందిస్తారట‌.

కేటగిరీలను బట్టి వాటిని వెబ్‌సైట్‌లో విక్రయిస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానం ద్వారా టోన్సర్డ్ వెంట్రుకల ఇ-వేలం నిర్వహిస్తారు. ఈ-వేలం ద్వారా కోట్లాది రూపాయలు టీటీడీ బోర్డ్‌కి అందుతాయి. మ‌రోవైపు తిరుపతి బాలాజీ ఆలయంలో మొక్కు చెల్లించుకున్న‌ వెంట్రుకలను అంతర్జాతీయ మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. యూరప్, అమెరికా, చైనా, ఆఫ్రికా మరియు ఇతర మార్కెట్‌లలో విగ్గులకి విపరీతమైన డిమాండ్ ఉంది కాబ‌ట్టి వారు వెంట్రులని పెద్ద మొత్తంలోనే కొనుగోలు చేస్తార‌ట‌.2018లో తిరుపతి బాలాజీ ఆలయంలో భక్తులు సమర్పించిన వెంట్రుకలు వేలం ద్వారా సుమారు ₹6.39 కోట్లు వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ (టిటిడి) ప్రతి సంవత్సరం మొదటి గురువారం ఈ వేలాన్ని నిర్వహిస్తుంది.

what will happen to hair after we give it in tirumala

తలనీలాలు ద్వారా వచ్చిన వెంట్రుకలని టీటీడీ గ్రేడ్ గా విభజించి వేలం పాట వేస్తారు. దాదాపు ఏటా 6000 కిలోల తలనీలాలు వస్తాయి అని గత లెక్కలు చెబుతున్నాయి.మరి ఎలా వాటిని గ్రేడ్ చేస్తారు అనేది చూస్తే. గ్రేడ్-1….. 31 ఇంచుల కంటే ఎక్కువ పొడవుంటే వాటిని గ్రేడ్ 1 అంటారు. గ్రేడ్-2…..16-30 ఇంచుల మధ్య పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 2 లెక్కిస్తారు. గ్రేడ్-3… 10-15 ఇంచులు పొడవుండే వెంట్రుకలు గ్రేడ్ 3 అంటారు. ఇక్కడ తలనీలాలు ఇచ్చేవారికి తెల్లవెంట్రుకలు ఉంటాయి, వాటిని సపరేట్ గ్రేడింగ్ ఉంటుంది..ఇక మొక్కుల రూపంలో వచ్చిన వీటిని ప్రతీ రోజూ సేకరించి వాటిని గ్రేడ్ చేసే సమయంలో ముందు వేడినీటిలో వేస్తారు, అందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది, అలా బాయిల్ చేసి ఆ జుట్టుని శుభ్రం చేస్తారు.. గోడౌన్లలో ఉష్టోగ్రతల మధ్య ఆరబెడతారు. ఇక ప్రాసెస్ పూర్తి అయ్యాక వీటిని వేలం వేస్తారు.

Sam

Recent Posts