ఆధ్యాత్మికం

Shiva Abhishekam : వేటితో అభిషేకం చేస్తే.. పరమశివుడు ప్రసన్నం అవుతాడో తెలుసా..?

Shiva Abhishekam : ప్రత్యేకించి శివుడు ని కార్తీకమాసంలో పూజిస్తూ ఉంటాము. అలానే, సోమవారం నాడు కూడా శివుడికి అభిషేకం చేయడం, పూజ చేయడం వంటివి చేస్తాము. పరమశివుడు అభిషేక ప్రియుడు అన్న విషయం మనకి తెలుసు. పరమశివుడు కి కొన్ని నీళ్లు పోసి, అభిషేకం చేస్తే మన కోరికలన్నీ కూడా నెరవేరిపోతాయి. శివుడిని నీటితోనే కాకుండా, ఎన్నో ద్రవ్యాలతో అభిషేకం చేయవచ్చు. ఒక్కో ద్రవ్యానికి ఒక్కో విశిష్టత ఉంది. మరి వేటితో అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.

పరమశివుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే, సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. ఆవు పెరుగుతో కనుక పరమశివుడికి అభిషేకం చేసినట్లయితే, ఆరోగ్యం కలుగుతుంది. అలానే యశస్సు, బలము కూడా కలుగుతాయి. ఆవు నెయ్యితో కనుక పరమశివుడికి అభిషేకం చేస్తే, ఐశ్వర్యం కలుగుతుంది. తేనెతో కనుక శివుడికి అభిషేకం చేస్తే, తేజోవృద్ది కలుగుతుంది. భస్మజలంతో అభిషేకం చేస్తే, పాపాలు తొలగిపోతాయి. కొబ్బరి నీటితో అభిషేకం చేస్తే సర్వసంపదలు కలుగుతాయి. పరమశివుడికి సుగంధ జలంతో అభిషేకం చేస్తే, పుత్ర ప్రాప్తి కలుగుతుంది.

with which items we have to do abhishekam for lord shiva

ద్రాక్ష రసంతో చేస్తే, అనుకున్న పనులు పూర్తవుతాయి. అలానే, పన్నీరు తో అభిషేకం చేస్తే భూ లాభం కలుగుతుంది. బిల్వజలంతో అభిషేకం చేస్తే, భోగ భాగ్యాలు కలుగుతాయి. ఇలా పరమశివుడికి, ఈ విధంగా అభిషేకం చేయడం వలన, ఇన్ని లాభాలు ఉంటాయి.

మరి ఈసారి శివుడిని ఆరాధించేటప్పుడు, అభిషేకం చేసేటప్పుడు, ఈ విషయాలను గుర్తుపెట్టుకోండి. ఈ విధంగా శివుడిని మీరు ఆరాధించినట్లయితే, మీకు తిరుగు ఉండదు. ఎంతో లాభాన్ని పొందొచ్చు. ఇలా అభిషేకం చేస్తే, శివుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. శివుడు అనుగ్రహాన్ని పొంది, ఏ బాధ లేకుండా సంతోషంగా ఉండవచ్చు. అలానే, పరమశివుడిని పూజించేటప్పుడు బిల్వపత్రాలని కూడా పూజలో ఉపయోగించండి.

Admin

Recent Posts