One Rupee Coin : మనం ఎంత కష్టపడి పని చేసినా ధనం నిల్వ ఉండదని కొందరు.. ధనం వచ్చినా కూడా నీటిలా ఖర్చైపోతుందని మరికొందరు బాధపడుతుంటారు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొంది ధనం మన దగ్గర ఉండాలంటే శాస్త్రం చెప్పిన కొన్ని విధి విధాలను పాటించాల్సి ఉంటుంది. వీటిని పాటించడం వల్ల ధనం మన దగ్గర ఉండడమే కాకుండా పది మందికి ఉపయోగపడే స్థాయిలో ఉంటామని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ దేవి అనుగ్రహాన్ని పొందడానికి పాటించాల్సిన నియమాలు ఏమిటి.. ఇంటి ఇల్లాలు ఎటువంటి నియమాలను పాటించడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను కలుగుతాయి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉదయాన్నే ఇంటి ప్రధాన ద్వారం ముందు శుభ్రంగా ఊడ్చి వీలైతే ఆవు పేడతో అలికి చక్కటి ముగ్గును వేయాలి. ముగ్గులో పసుపు, కుంకుమను వేసి అలంకరించాలి. అలాగే గుమ్మానికి ఇరు పక్కలా సువాసన వెదజల్లే పువ్వులను ఉంచాలి. లక్ష్మీ దేవికి కలువ పువ్వులు ఇష్టం కనుక వీటిని గుమ్మానికి ఇరు పక్కలా పెట్టి రోజు మార్చి రోజు మారుస్తూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ దేవి తాండవం చేస్తుందట. ఈ పువ్వులు లేని వారు ఏదో ఒక సువాసన వచ్చే పువ్వును ఉంచడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుందని పండితులు చెబుతున్నారు.
అలాగే గుమ్మానికి లోపలి వైపు అనగా ఇంట్లో ఏదో ఒక పక్కన రాగి చెంబును ఉంచి దానిలో నీళ్లు నింపి అందులో ఐదు 1 రూపాయి బిళ్లలు, పచ్చకర్పూరం, ఒక ఎర్రని పువ్వును ఉంచాలి. ఇలా చేయడం వల్ల దారిద్య్రం పోయి అప్పుల బాధలు తగ్గి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. అలాగే శుక్రవారం నాడు ఇరవై ఒకటి 1 రూపాయి బిళ్లలను తీసుకుని ఓం శ్రీం అయిం నమః అనే మంత్రాన్ని జపిస్తూ లక్ష్మి దేవి అమ్మ వారికి పూజ చేయాలి. తరువాత అమ్మ వారికి హారతి ఇవ్వాలి. ఈ తరువాత ఎరుపు రంగు వస్త్రంలో ఆ రూపాయి బిళ్లలను ఉంచి మూట కట్టి గాజు పాత్రలో ఉంచి ఆ రోజంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఆ ఎరుపు రంగు మూటను తీసుకుని బీరువాలో ఉంచాలి.
ఈ విధంగా ఆరు శుక్ర వారాలు చేసిన తరువాత ఆ ఆరు మూటలను తీసుకుని లక్ష్మి దేవి అమ్మవారి గుడిలో ఉండే హుండీలో వేయాలట. ఇలా చేయడం వల్ల కచ్చితంగా ఆర్థిక ఇబ్బందులు తొలిగిపోతాయట. అలాగే గరువారం, శుక్రవారం సాయంత్రం పూట సాంబ్రాణి వేసుకుంటే చాలా మంచిదట. ఇంట్లో ఉండే నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి చక్కటి ప్రశాంతత లభిస్తుంది. ప్రతి శుక్రవారం ఇంట్లో ఉండే తులసి కోటకు, గడపలకు పసుపుతో అలంకరించి పూజ చేయడం వల్ల దారిద్య్రం తొలగిపోతుంది. ఈ పరిహారాలను ఇంటి ఇల్లాలు పాటించడం వల్ల అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని ఆధ్యాత్మిక నిపుణులు చెబుతున్నారు.