చాలా మంది సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం కోసం ఎన్నో రకాల వీడియోలను పోస్ట్ చేస్తూ ఉంటారు. అయితే దీనిలో భాగంగా స్టంట్స్ వంటివి చేసి ఎంతో ప్రమాదకరమైన పనులు చేస్తారు. ఇటువంటి స్టంట్స్ కి సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు కూడా వైరల్ అవుతూ ఉంటాయి. అదే విధంగా ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.
ఒక యువకుడు ట్రైన్ కదులుతున్న సమయంలో తన కాలు ను ప్లాట్ ఫామ్ పై పెట్టి కొద్ది దూరం వరకు అలానే ఉన్నాడు. ఇలా చేసిన తర్వాత తిరిగి ట్రైన్ లో పెట్టాడు. ఇటువంటి స్టంట్స్ చేయడంతో నెటిజెన్లు యువకుడును ఎందుకు ఇలాంటి రిస్క్ చేయడం అని ప్రశ్నిస్తున్నారు.
అయితే ఈ వైరల్ వీడియోకు 1.2 కోట్ల వ్యూస్ వచ్చాయి మరియు రెండు లక్షలు పైగా లైక్స్ కూడా వచ్చాయి. ఇటువంటి వైరల్ వీడియో చూసిన నెటిజెన్లు ఇటువంటి రిస్క్ చేయడం అవసరమా, ప్రాణాలకు ప్రమాదకరమైన పనులు చేసి త్వరగా చనిపోదాం అనుకుంటున్నావా అంటూ కామెంట్ చేస్తున్నారు. మరి కొందరు అథారిటీలు ఇటువంటి పనులకు అడ్డు చెప్పాలని లేకపోతే రోజు రోజుకు పెరిగిపోతాయని అంటున్నారు.