Iron Foods : వీటిని వారం రోజుల పాటు తింటే చాలు.. శ‌రీరంలో కావ‌ల్సినంత రక్తం ప‌డుతుంది..

Iron Foods : నేటి కాలంలో చాలా మంది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నారు. స్త్రీలు మ‌రీ ఎక్కువ‌గా ఈ స‌మ‌స్య‌ను ఎదుర్కొంటున్నారు. మ‌న శ‌రీరంలో హిమోగ్లోబిన్ త‌గ్గ‌డం వ‌ల్ల ఎర్ర ర‌క్త‌క‌ణాలు త‌గ్గుతాయి. దీంతో ర‌క్తం ఉండాల్సిన స్థానాన్ని నీరు ఆక్ర‌మిస్తుంది. దీంతో శ‌రీరం బ‌రువుగా అనిపించ‌డం, కాళ్లు తిమిర్లు ప‌ట్ట‌డం, క‌ళ్లు తిర‌గ‌డం, చిన్న చిన్న ప‌నుల‌కే అల‌సిపోవ‌డం, జుట్టు రాల‌డం ఇలా ఎన్నో ర‌కాల స‌మ‌స్య‌ల బారిన ప‌డాల్సి వ‌స్తుంది. అలాగే మ‌న శ‌రీరంలో ఐర‌న్, విట‌మిన్ సి, బి 12, ఫోలిక్ యాసిడ్ వంటి పోష‌కాల లోపం కూడా ర‌క్త‌హీన‌త‌కు దారి తీస్తుంది. శ‌రీరానికి త‌గినంత ఐర‌న్ ను అందించ‌డం వ‌ల్ల శ‌రీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి మ‌నం బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

శ‌రీరంలో ఐర‌న్ శాతాన్ని పెంచే కొన్ని ముఖ్య‌మైన ఆహార ప‌దార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ర‌క్త‌హీన‌త‌ను నివారించే ముఖ్య‌మైన ఆహారాల్లో మాంసం ఒక‌టి. మ‌ట‌న్ ను కానీ, మ‌ట‌న్ లివ‌ర్ ను వారానికి రెండు నుండి మూడు సార్లు తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. ఎందుకంటే మాంసం లివ‌ర్ లో హిమోగ్లోబిన్ ఉత్ప‌త్తికి అవ‌స‌ర‌మ‌య్యే ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. అలాగే ఈ ఐర‌న్ మ‌న శ‌రీరం త్వ‌ర‌గా గ్ర‌హిస్తుంది. అలాగే మాంసాహారులు చేప‌ల‌ను కూడా ఎక్కువ‌గా ఆహారంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ఐర‌న్ తో శ‌రీరానికి కావ‌ల్సిన ఇత‌ర పోష‌కాలు కూడా ల‌భిస్తాయి. అలాగే పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. సిట్ర‌స్ జాతికి చెందిన పండ్లల్లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి.

Iron Foods take them daily to increase blood levels
Iron Foods

ఆపిల్, దానిమ్మ‌, స్ట్రాబెరీ, నిమ్మ‌, నారింజ‌, పుచ్చ‌కాయ వంటి పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా త్వ‌ర‌గా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. అదే విధంగా ప్ర‌తిరోజూ ఒక ఉడికించిన కోడిగుడ్డును తీసుకోవ‌డం వ‌ల్ల కూడా ర‌క్త‌హీన‌త స‌మ‌స్య త‌గ్గుతుంది. అదే విధంగా ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిల‌ను పెంచ‌డంలో డ్రై ఫ్రూట్స్ కూడా మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ముఖ్యంగా ఆప్రికాట్ ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ఈ ఆప్రికాట్ లో ఐర‌న్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను త‌గ్గించ‌డంలో స‌హాయ‌ప‌డుతుంది. శ‌రీరంలో రక్తాన్ని పెంచే ఆహారాల్లో అంజీర్ కూడా ఒక‌టి. వీటిలో ఐర‌న్ తో పాటు మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌నం ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌ను అధిగ‌మించ‌వ‌చ్చు. రోజూ రాత్రి రెండు అంజీరాల‌ను నీటిలో వేసి నాన‌బెట్టాలి.

ఉద‌యాన్నే ఈ నీటిని తాగా అంజీరాల‌ను తినాలి. ఇలా తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలు వేగంగా పెరుగుతాయి. అదేవిధంగా వేరు శ‌న‌గల‌ను, సారా ప‌ప్పును, జీడిప‌ప్పును, బాదం ప‌ప్పును, ఎండు ద్రాక్ష‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మ‌న శ‌రీరంలో ఐర‌న్ స్థాయిలు పెరుగుతాయి. ముఖ్యంగా ఎండుద్రాక్ష‌ను నీటిలో నాన‌బెట్టి తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం మంచి ఫ‌లితాల‌ను పొంద‌వ‌చ్చు. ర‌క్త‌హీన‌త స‌మ‌స్య‌తో బాధ‌ప‌డే వారు ఈ ఆహార ప‌దార్థాల‌ను రోజూ వారి ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరానికి త‌గినంత ల‌భిస్తుంది. దీంతో మ‌నం ర‌క్త‌హీన‌త స‌మ‌స్య నుండి చాలా సుల‌భంగా బ‌య‌ట‌ప‌డ‌వ‌చ్చు. ఈ ఆహారాల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఇత‌ర పోష‌కాల‌తో పాటు చ‌క్క‌టి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవ‌చ్చు.

Share
D

Recent Posts