మన శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాల పోషకాలను రోజూ తీసుకోవాలి. ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ మన శరీరానికి అవసరం. వీటితో శరీరం అనేక విధులన నిర్వర్తిస్తుంది. ఏదైనా ఒక విటమిన్ లోపం సంభవిస్తే చాలు అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా విటమిన్ బి12 లోపిస్తే తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. కనుక ఈ విటమిన్ ఉండే ఆహారాలను రోజూ తీసుకోవాలి.
విటమిన్ బి12ను కోబాలమైన్ అంటారు. ఇది మెదడు పనితీరుకు సహాయ పడుతుంది. ఈ విటమిన్ వల్ల ఎర్ర రక్త కణాలు తయారవుతాయి. డీఎన్ఏ క్రమబద్దీకరింపబడుతుంది. విటమిన్ బి12 లోపం ఏర్పడితే శరీరంలో నాడీ సంబంధ సమస్యలు వస్తాయి.
విటమిన్ బి12 శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయ పడుతుంది. విటమిన్ బి12 లోపం ఉంటే బరువు వేగంగా, అకస్మాత్తుగా కోల్పోతారు. కండరాలు బలహీనం అవుతాయి. చర్మం పసుపు రంగులోకి మారుతుంది. నాడీ మండల వ్యవస్థ దెబ్బ తింటుంది. అందువల్ల విటమిన్ బి12 లోపం రాకుండా చూసుకోవాలి. 18 ఏళ్లకు పైబడిన వారికి రోజుకు 25.4 మైక్రోగ్రాముల విటమిన్ బి12 అవసరం అవుతుంది.
మాంసాహారం తరచూ తినేవారిలో సహజంగానే విటమిన్ బి12 లోపం రాదు. ఎందుకంటే అనేక రకాల మాంసాహారాల్లో విటమిన్ బి12 ఉంటుంది. దీని వల్ల సులభంగా విటమిన్ బి12 అందుతుంది. ముఖ్యంగా చికెన్, మటన్, చేపలు, కోడిగుడ్లలో విటమిన్ బి12 ఉంటుంది. ఈ కారణంగా ఈ ఆహారాలను తినేవారికి ఈ విటమిన్ లోపం రాదు. శాకాహారం తినేవారిలోనే ఎక్కువగా ఈ విటమిన్ లోపం కనిపిస్తుంటుంది.
అయితే పలు రకాల శాకాహార పదార్థాల్లోనూ విటమిన్ బి12 ఉంటుంది. పాలు, పెరుగు, చీజ్, బాదంపప్పు, జీడిపప్పు, పనీర్, ఓట్స్, కొబ్బరిపాలలో విటమిన్ బి12 ఉంటుంది. అందువల్ల వీటిని శాకాహారులు తీసుకుంటే ఈ విటమిన్ లోపం రాకుండా చూసుకోవచ్చు. దీంతో ఆరోగ్యంగా ఉంటారు.
ఇక విటమిన్ బి12 లోపం ఉంటే మద్యం సేవించరాదు. మద్యం సేవిస్తే విటమిన్ బి12 స్థాయిలు తగ్గుతాయి. ఇక దీంతోపాటు ఫోలిక్ యాసిడ్ ఉండే ఆహారాలను కూడా తీసుకుంటే మంచిది. దీని వల్ల అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365