పోష‌కాహారం

చలికాలంలో ఆకుకూరలు తినొచ్చా?

– ఆకుకూరల్లో ఏ,సీ,కే విటమిన్లు అధికంగా ఉంటాయి. ఫోలిక్‌ యాసిడ్స్‌ కూడా కావాల్సినంత ఉంటుంది. ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, ఐరన్‌ వీటిలో పుష్కలంగా ఉంటాయి.

– ఆకుకూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మంచిదే కాని హానికరం ఉండదు. అది ఏ కాలంలో అయినా మంచి చేస్తుంది. ఎలాంటి అనుమానాలు లేకుండా ఆకుకూరలు సేవించండి.

– రోజూ ఆకుకూరలు తీసుకోవడం ద్వారా శరీరంలో ఎర్రరక్తకణాల వృద్ధి అవుతాయి. శ్వాస సంబంధమైన సమస్యలను దూరం చేస్తాయి.

– ముఖ్యంగా చలికాలంలో మహిళలు పాలకూర తినాలి. తినడం వల్ల చర్మసౌందర్యానికి కూడా పాలకూర తోడ్పడుతుంది. దీనితోపాటు తేనె కూడా రోజూ వాడాలి.

– తేనెవల్ల ఆరోగ్యానికి చాలా మేలు. గొంతునొప్పికి, దగ్గుకు తేనె చాలామంచిది. గొంతులో మంట ఉన్నవారు రోజూ తేనె తీసుకుంటే సమస్య నివారించవచ్చు. తేనెలో ఉండే యాంటి మైక్రోబయల్‌ గుణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి. ప్రతిరోజూ ఒక స్పూన్‌ తేనె తాగితే మంచిది. పొట్టచుట్టూ కొవ్వు అధికంగా ఉన్నవారికి తేనె పొట్టను శుభ్రంచేసి జీర్ణశక్తిని పెంచుతుంది.

can we take leafy greens in winter

– రోజూ నిద్రలేవగానే గోరువెచ్చని నీటిలో తేనె వేసుకొని తాగితే ఎంతో మంచిది. ఇకపోతే.. చలికాలంలో క్యారెట్‌, బీట్‌రూట్‌, ఆలూ వంటివి డైట్‌లో చేర్చుకుంటే మంచిది. శీతాకాలంలో వచ్చే జలుబు, దగ్గు నుంచి ఉపశమనం పొందేందుకు క్యారెట్‌ తీసుకోవాలి.

– దగ్గు, జలుబుకు కారణమయ్యే బ్యాక్టీరియాతో పోరాడగలిగే శక్తి ఇందులో ఉంటుంది. అలాగే ఆలుగడ్డలో శరీరానికి అవసరమయ్యే చాలా పోషకాలు ఉన్నాయి.

– రోగనిరోధక శక్తిని పెంచే విటమిన్‌ సీ, బీ6 వీటిలో ఉంటాయి. అలాగే దానిమ్మను చలికాలంలో తప్పక తీసుకోవాలి. ఇందులో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది.చలికాలంలో దానిమ్మ తీసుకుంటే ఎలాంటి మందులు అవసరం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

– దానిమ్మగింజల్ని సలాడ్స్‌ రూపంలో తీసుకోవచ్చు. ఇది క్యాన్సర్‌ కణాలను నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు ఉండే దానిమ్మను తీసుకోవడం ద్వారా హృద్రోగ సమస్యలు దూరమవుతాయి. రోజుకో కప్పు గింజలు తింటే చెబు కొలెస్ట్రాల్‌ చేరదని వెల్లడించారు.

Admin

Recent Posts