Dry Apricots : మనం ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ వ్యాయామం చేయడం.. వేళకు భోజనం చేయడం.. నిద్ర పోవడంతోపాటు.. అన్ని పోషకాలు కలిగిన ఆహారాలను తీసుకోవాల్సి ఉంటుంది. రోజూ పోషకాహారం తీసుకుంటేనే మనకు కావల్సిన అన్ని పోషకాలు లభిస్తాయి. దీంతో శరీరానికి పోషణ అందుతుంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉంటారు. రోగాలు రాకుండా ఉంటాయి. అయితే మనకు పోషకాలను అందించే వాటిల్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఒకటి. ఇవి మనకు అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలను పొందవచ్చు. ముఖ్యంగా డ్రై యాప్రికాట్స్ ను తినడం వల్ల మనకు ఎంతగానో మేలు జరుగుతుంది. వీటిని రోజువారీ ఆహారంలో భాగంగా తినడం వల్ల ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
డ్రై యాప్రికాట్స్‌ను.. యాప్రికాట్స్ పండ్లను ఎండబెట్టి తయారు చేస్తారు. ఇవి మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాయి. వీటిని తినడం వల్ల అనేక లాభాలను పొందవచ్చు. ముఖ్యంగా డ్రై యాప్రికాట్స్‌లో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రోగాలను అడ్డుకునేందుకు కావల్సిన శక్తిని అందిస్తుంది. అలాగే కంటి చూపును మెరుగు పరుస్తుంది. కంటి సమస్యలు తగ్గుతాయి. అందువల్ల డ్రై యాప్రికాట్స్‌ను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇక ఈ పండ్లను తినడం వల్ల ఫైబర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది. ముఖ్యంగా గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు ఉండవు. అలాగే కొవ్వు కూడా కరుగుతుంది. అధిక బరువు తగ్గుతారు.
ఈ పండ్లను తినడం వల్ల పొటాషియం అధికంగా లభిస్తుంది. ఇది బీపీని నియంత్రిస్తుంది. రక్తనాళాల్లోని అడ్డంకులను తొలగిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే ఈ పండ్లను తరచూ తింటుంటే రక్తం కూడా శుద్ధి అవుతుంది. రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మన శరీరంలోని వ్యర్థాలను బయటకు పంపుతాయి. హానికరమైన ఫ్రీ ర్యాడికల్స్‌ను నాశనం చేస్తాయి.
ఈ పండ్లను తింటే విటమిన్ సి, ఎ బాగా లభిస్తాయి. దీంతో చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. చర్మంపై ఉండే ముడతలు, మచ్చలు పోతాయి. యవ్వనంగా కనిపిస్తారు. వీటిల్లోని కాల్షియం ఎముకలను దృఢంగా మారుస్తుంది. ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కనుక యాప్రికాట్స్‌ను తరచూ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఈ పండ్లు నేరుగా లభిస్తే వాటినే తినాలి. అలా వీలు కుదరకపోతే డ్రై యాప్రికాట్స్‌ను తినాలి. వీటిని తిన్నా కూడా మనకు మేలు జరుగుతుంది. పైన తెలిపిన ప్రయోజనాలు కలుగుతాయి.