Cheese Dosa : సాధారణంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో భాగంగా చాలా మంది అనేక రకాల ఆహారాలను తింటుంటారు. అలా తినే వాటిల్లో దోశ కూడా ఒకటి. దోశలు వివిధ రకాల వెరైటీల్లో అందుబాటులో ఉన్నాయి. కొందరు ఇంట్లోనే వెరైటీ దోశలను వేసుకుని తింటుంటారు. ఇక మనకు బయట కూడా అనేక రకాల వెరైటీ దోశలు లభిస్తుంటాయి. అయితే వాటిల్లో చీజ్ దోశ కూడా ఒకటి. ఇది మనకు బయట దోశ సెంటర్ లేదా స్ట్రీట్ ఫుడ్ మొబైల్ క్యాంటీన్‌లలో ఎక్కువగా లభిస్తుంది. కానీ కాస్త శ్రమిస్తే ఈ దోశను మనం ఇంట్లోనే ఎంతో రుచిగా వేసుకోవచ్చు. అందరూ ఇష్టంగా తింటారు. ఇక చీజ్ దోశను ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
చీజ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
మినప పప్పు – 1 కప్పు, బియ్యం – 1 కప్పు, అన్నం లేదా అటుకులు – కొద్దిగా, మెంతులు – 1 టీస్పూన్, శనగ పప్పు – 2 టేబుల్ స్పూన్లు, చీజ్ – 100 గ్రాములు, క్యారెట్ తురుము – అర కప్పు, పచ్చి మిర్చి తురుము – పావు కప్పు, ఉప్పు – తగినంత, నూనె లేదా నెయ్యి – సరిపడా.
చీజ్ దోశను తయారు చేసే విధానం..
ముందు రోజే మినప పప్పు, బియ్యం, మెంతులు, శనగ పప్పును 8 గంటలు నానబెట్టుకుని రుబ్బుకుని ఉంచాలి. రుబ్బేటప్పుడు కాస్త అన్నం లేదా నానబెట్టిన అటుకులు కూడా వేయాలి. ఉప్పు కలిపి పిండిని పులియబెట్టాలి. మరునాడు మామూలుగానే పెనం మీద దోశ వేసుకుని నూనె లేదా నెయ్యి వేస్తూ కాలనివ్వాలి. కాస్త కాలిన తరువాత చీజ్ తురుము, క్యారెట్ తురుము, పచ్చి మిర్చి తురుములను పైన చల్లాలి. తరువాత కాసేపు వేయించాలి. దోశ వేగిన తరువాత తీయాలి. దీన్ని ఏదైనా చట్నీతో తింటే ఎంతో రుచిగా ఉంటుంది. రెగ్యులర్‌గా చేసుకునే దోశలకు బదులుగా ఒక్కసారి ఇలా చీజ్ దోశలను ట్రై చేయండి. ఎంతో బాగుంటాయి. అందరికీ నచ్చుతాయి.