Hair Fall : ప్రస్తుత తరుణంలో చాలా మంది జుట్టు రాలే సమస్యతో సతమతం అవుతున్నారు. ఇందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. ఒత్తిడి, ఆందోళనతోపాటు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, పోషకాహార లోపం, కాలుష్యం.. వంటి పలు కారణాల వల్ల జుట్టు రాలే సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తోంది. అయితే కింద తెలిపిన ఆహారాలను రోజూ తింటే.. దాంతో జుట్టు రాలే సమస్య నుంచి బయట పడవచ్చు. వీటిని రోజూ క్రమం తప్పకుండా 10 రోజుల పాటు వరుసగా తింటు జుట్టు రాలే సమస్య నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఆ ఆహారాలు ఏమిటంటే..
1. పప్పు దినుసులు, పచ్చి బఠానీలు, పెసలు వంటి వాటిని రోజూ ఆహారంలో తీసుకోవాలి. వీటిల్లో ఉండే ప్రోటీన్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. రోజుకు ఒక కప్పు ఉడకబెట్టిన పచ్చి బఠానీలు లేదా పెసలను తింటే ఫలితం ఉంటుంది.
2. చియా విత్తనాల్లో ఒమొగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి. జుట్ట రాలడాన్ని తగ్గిస్తాయి.
3. చిరు ధాన్యాలను రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా జుట్టు పెరుగుతుంది. జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.
4. కిస్మిస్, బాదంపప్పు, జీడిపప్పు, పిస్తా వంటి వాటిని రోజుకు గుప్పెడు మోతాదులో తినాలి. దీంతో పోషకాహార లోపం నుంచి బయట పడవచ్చు. ఇవి జుట్టు రాలడాన్నితగ్గిస్తాయి. జుట్టును పెరిగేలా చేస్తాయి.
5. విటమిన్ ఎ, సిలు ఎక్కువగా ఉండే ఆహారాలను తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలకుండా ఉంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించవచ్చు. ముఖ్యంగా పాలకూర, యాపిల్స్, నిమ్మజాతి పండ్లు, కూరగాయలు వంటి వాటిని అధికంగా తీసుకోవాలి. దీంతో జుట్టు రాలడాన్ని తగ్గించవచ్చు.
6. కోడిగుడ్లు, చేపలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం తగ్గుతుంది. శిరోజాలు ఒత్తుగా, దృఢంగా పెరుగుతాయి.