Holy Basil Leaves : భారతీయులు ఎంతో పురాతన కాలం నుంచి తులసి మొక్క ఆకులను ఉపయోగిస్తున్నారు. వాటితో పలు అనారోగ్య సమస్యలను నయం చేసుకుంటున్నారు. ఆయుర్వేదంలో తులసికి ఎంతో ప్రాధాన్యతను కల్పించారు. ఈ క్రమంలోనే అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు తులసి ఎంతగానో పనిచేస్తుంది. తులసి ఆకులతో అనేక రోగాలను నయం చేసుకోవచ్చు.

తులసి ఆకుల్లో అనేక పోషకాలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందువల్ల ఇవి తగ్గించని రోగం అంటూ ఉండదు. అనేక రోగాలకు తులసి ఆకులు మందుగా పనిచేస్తాయి. తులసి మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఎలాంటి రోగాలు రావని మన పెద్దలు చెబుతుంటారు. అంటే ఈ మొక్క ఆకులను ఎలాంటి రోగాలకు అయినా సరే ఉపయోగించవచ్చన్నమాట. అందుకని తులసి చేసే మేలును ఎవరూ మరువకూడదు.
తులసి ఆకులను రోజూ పరగడుపునే 3 చొప్పున తింటుండాలి. దీంతో శరీరంలో అనేక మార్పులు కలుగుతాయి. అనేక వ్యాధులను నయం చేసుకోవచ్చు. వీటితో ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ప్రస్తుత తరుణంలో చాలా మంది రోజూ ఒత్తిడితో సతమతం అవుతున్నారు. రోజూ అనేక సందర్భాల్లో ఆందోళన, డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారు. అందుకు అనేక కారణాలు ఉంటున్నాయి. అయితే ఆయా సమస్యల నుంచి బయట పడాలంటే రోజుకు 3 తులసి ఆకులను ఉదయాన్నే పరగడుపునే తినాలి. ఇవి మనస్సును ప్రశాంతంగా మారుస్తాయి. దీంతో ఆయా మానసిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
2. డయాబెటిస్ అనేది ప్రస్తుతం చాలా మందిని ఇబ్బందులకు గురి చేస్తున్న సమస్యల్లో ఒకటి. టైప్ 2 డయాబెటిస్‌తో చాలా మంది బాధపడుతున్నారు. అలాంటి వారు రోజూ పరగడుపునే తులసి ఆకులు మూడు తినడం వల్ల షుగర్ లెవల్స్ అదుపులోకి వస్తాయి. క్రమం తప్పకుండా రోజూ వాటిని తింటే షుగర్ నియంత్రణలో ఉంటుంది. దీంతో ఇతర అనారోగ్య సమస్యలు రాకుండా జాగ్రత్త పడవచ్చు.
3. మన శరీరంలో రోజూ కొలెస్ట్రాల్ లెవల్స్ పేరుకుపోతుంటాయి. శారీరక శ్రమ, వ్యాయామం చేసినా కూడా కొందరికి రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడుతుంటాయి. కనుక అలా జరగకుండా ఉండాలంటే రోజూ తులసి ఆకులను తినాలి. దీనివల్ల కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గి రక్త నాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి. ఫలితంగా హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
4. పిల్లలకు జ్ఞాపకశక్తి, ఏకాగ్రత ఎక్కువగా ఉంటేనే వారు చదువుల్లో రాణిస్తారు. తెలివితేటలు పెరుగుతాయి. అయితే అందుకు గాను తులసి ఆకులు ఎంతగానో ఉపయోగపడతాయి. కనుక వారితోనూ రోజూ తులసి ఆకులను తినిపించాలి. దీని వల్ల జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరిగి వారు చదువుల్లో రాణిస్తారు.
5. తులసి ఆకులను తినడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రోగ నిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుంది. దీంతో వ్యాధులు, ఇన్ఫెక్షన్లు రాకుండా ఉంటాయి. సీజనల్ వ్యాధులు రాకుండా అడ్డుకోవచ్చు.
6. తీవ్రమైన తలనొప్పి ఉన్నవారు రోజూ తులసి ఆకులను తింటుంటే క్రమంగా ఆ సమస్య తగ్గుముఖం పడుతుంది. క్రమం తప్పకుండా తులసి ఆకులను తింటే ప్రయోజనం కలుగుతుంది.
7. తులసి ఆకులను రోజూ తినడం వల్ల నోటి దుర్వాసన తగ్గుతుంది. నోట్లో ఉండే బాక్టీరియా నశిస్తుంది. దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా, దృఢంగా మారుతాయి.
8. తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకుండా అజీర్తి సమస్యతో బాధపడేవారు, మలబద్దకం, గ్యాస్ ఉన్నవారు, ఆకలి లేని వారు.. తులసి ఆకులను తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆ సమస్యలు దెబ్బకు తగ్గిపోతాయి.
9. కంటి చూపు సరిగ్గా లేని వారు, ఇతర కంటి సమస్యలు ఉన్నవారు రోజూ తులసి ఆకులను తినడం వల్ల ప్రయోజనం కలుగుతుంది.
10. మలేరియా జ్వరం వచ్చిన వారు తులసి ఆకులను తింటుంటే వెంటనే జ్వరం తగ్గిపోతుంది. పూటకు మూడు తులసి ఆకులను అర టీస్పూన్ మిరియాల పొడితో కలిపి అలాగే తినాలి. దీంతో జ్వరం త్వరగా తగ్గుతుంది.