Ayurvedam365
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం
No Result
View All Result
Ayurvedam365
Home పోష‌కాహారం పండ్లు

Dates : ఖ‌ర్జూరా పండ్ల‌తో పురుషుల‌కు ఎంత బ‌లం అంటే.. వారి స‌మ‌స్య‌లు అన్నీ పోతాయి..!

D by D
July 6, 2022
in పండ్లు, వార్త‌లు
Share on FacebookShare on Twitter

Dates : తీపి ప‌దార్థాల త‌యారీలో మ‌నం పంచ‌దార‌కు బ‌దులుగా ఉప‌యోగించుకోగ‌లిగే వాటిల్లో ఖ‌ర్జూర పండ్లు కూడా ఒక‌టి. ఇవి మ‌నంద‌రికీ తెలుసు. ఖర్జూర పండ్లు ఎంతో తియ్య‌ని రుచిని క‌లిగి ఉంటాయి. ఎండిన ఖ‌ర్జూరాల‌ను కూడా మ‌నం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. మ‌న‌కు మార్కెట్ లో వివిధ ర‌కాల ఖ‌ర్జూరాలు ల‌భిస్తాయి. వీటిని తిన‌డం వ‌ల్ల మ‌నం రుచితోపాటు ఆరోగ్యాన్ని కూడా పొంద‌వ‌చ్చు. ఖర్జూర పండ్లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయి. ఖ‌ర్జూర పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దీనిని సంస్కృతంలో ఖ‌జ్జూ, రాజ్ ఖ‌ర్జూరి, పిండ ఖ‌ర్జూరి అని హిందీలో సులేమానీ, చోక్రా అని పిలుస్తారు. ఇవి వేడి చేసే గుణాన్ని క‌లిగి ఉంటాయి.

ఖర్జూర పండ్లు చాలా ఆల‌స్యంగా జీర్ణ‌మ‌వుతాయి. పైత్యం, మొల‌లు, దాహం, క‌ఫం, ఉబ్బ‌సం, వాతం, జ్వ‌రం, అతిసారం, ద‌గ్గు వంటి వాటిని న‌యం చేయ‌డంలో ఖ‌ర్జూర పండ్లు మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డ‌తాయి. గుండెను, మూత్ర‌పిండాల‌ను ఆరోగ్యంగా ఉంచ‌డంలో కూడా ఖ‌ర్జూర పండ్లు స‌హాయ‌ప‌డ‌తాయి. ఖ‌ర్జూర పండును నోట్లో పెట్టుకుని చ‌ప్పరిస్తూ ఉంటే వెక్కిళ్లు త‌గ్గిపోతాయి. ఎండు ఖ‌ర్జూరం లోప‌ల ఉండే గింజ‌ను తీసేసి ఆ ఖ‌ర్జూరంలో ఎర్ర గుగ్గిలాన్ని నింపి దానిని గోధుమ‌పిండితో మూసేసి నిప్పుల మీద వేసి ఎర్ర‌గా అయ్యే వ‌ర‌కు కాల్చాలి. త‌రువాత గోధుమ‌పిండిని తీసేసి ఆ ఖ‌ర్జూరాన్ని నీటితో క‌లిపి నూరాలి. ఆ మిశ్ర‌మాన్ని ఒక గ్రాము ప‌రిమాణంలో ఉండే మాత్ర‌లుగా చేసి నిల్వ చేసుకోవాలి. రోజూ ఒక మాత్ర‌ను ఒక క‌ప్పు పాల‌తో క‌లిపి తీసుకుంటూ ఉంటే ఎటువంటి నొప్పి న‌డుము నొప్పి అయినా 20 రోజుల‌ల్లో త‌గ్గుతుంది.

amazing health benefits of eating Dates everyday
Dates

ఖ‌ర్జూర గింజ‌ల‌ను ఎండ‌బెట్టి వాటిని తేనెతో క‌లిపి నూరాలి. ఆ గంధాన్ని కంది గింజ ప‌రిమాణంలో రోజూ రాత్రి ప‌డుకునే ముందు క‌ళ్ల‌ల్లో పెట్టుకోవ‌డం వ‌ల్ల కంటి పూలు క‌రిగిపోతాయి. ఎండు ఖ‌ర్జూరాల‌ని నాలుగు ముక్క‌లుగా కోసి ఒక మ‌ట్టి పాత్ర‌లో వేయాలి. అవి మునిగే వ‌ర‌కు నాటు ఆవు నెయ్యిని పోసి ఆ పాత్ర‌పై మూత పెట్టి 20 రోజుల పాటు క‌దిలించ‌కుండా ఉంచాలి. తరువాత రోజుకు రెండు ముక్క‌లు రెండు పూట‌లా నెయ్యితో పాటు క‌లిపి తినాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల అమిత‌మైన వీర్య బ‌లం క‌లుగుతుంది. అంతేకాకుండా 20 గ్రాముల ఖ‌ర్జూర పండ్ల‌ను, 10 గ్రాముల మ‌ర్రి ఊడ‌ల కొన‌ల‌ను క‌లిపి మెత్త‌గా నూరాలి. ఈ మిశ్ర‌మాన్ని పావు లీట‌ర్ పాల‌లో వేసి మ‌రిగించి రెండు పూట‌లా తాగుతూ ఉంటే వీర్య హీన‌త త‌గ్గుతుంది.

100 గ్రాముల ఎండు ఖ‌ర్జూరాల‌న్ని మెత్త‌గా నూరి పొడిలా చేసుకోవాలి. త‌రువాత 100 గ్రాముల వామును, 100 గ్రాముల శొంఠిని తీసుకుని దోర‌గా వేయించి పొడిలా చేసుకోవాలి. వీట‌న్నింట‌నీ క‌లిపి నిల్వ చేసుకోవాలి. బహిష్టు ఆగిన స్త్రీలు రోజుకు రెండు పూట‌లా అర టీ స్పూన్ నుండి ఒక టీ స్పూన్ మోతాదులో ఒక క‌ప్పు వేడి పాల‌లో క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల బ‌హిష్టు మ‌ర‌లా ప్రారంభ‌వుతుంది. బ‌హిష్టు ప్రారంభం కాగానే ఈ చూర్ణాన్ని తీసుకోవ‌డం ఆపాలి. ఎండు ఖర్జూరాల‌ను, సీమ బాదం ప‌ప్పును, ఎండు ద్రాక్ష‌ను, ప‌టిక బెల్లాన్ని స‌మ‌పాళ్ల‌లో తీసుకుని ఒక మ‌ట్టి పాత్ర‌లో ఉంచి అవి మునిగే వ‌ర‌కు స్వ‌చ్ఛ‌మైన తేనెను పోసి పాత్ర మీద మూత పెట్టి వ‌స్త్రాన్ని ఉంచి గాలి చొర‌బ‌డ‌కుండా గ‌ట్టిగా క‌ట్టులా క‌ట్టాలి. ఈ పాత్ర‌ను క‌దిలించ‌కుండా 21 రోజుల పాటు ఉంచాలి. ఆ త‌రువాత ఈ మిశ్ర‌మాన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. పూట‌కు 10 గ్రాముల మోతాదులో ఆహారానికి ఒక గంట ముందు తింటూ ఉంటే శ‌రీరానికి ఎంతో శ‌క్తి ల‌భించ‌డంతోపాటు ర‌క్త వృద్ధి కూడా జ‌రుగుతుంది.

ఖ‌ర్జూర గింజ‌ల‌ను కాల్చి బూడిద చేసి ఆ బూడిద‌ను సేక‌రించి నిల్వ చేసుకోవాలి. ఈ బూడిద‌ను 2 గ్రాముల మోతాదులో అర టీ స్పూన్ కండ చ‌క్కెర‌తో క‌లిపి తింటే అన్ని ర‌కాల నీళ్ల విరేచ‌నాలు త‌గ్గుతాయి. ఖ‌ర్జూర గింజ‌ల‌ను నోట్లో పెట్టుకుని చ‌ప్ప‌రిస్తూ దాని ర‌సాన్ని మింగుతూ ఉంటే పొట్ట ఉబ్బ‌రం త‌గ్గుతుంది. ఎండు ఖ‌ర్జూర విత్త‌నాల‌ను దంచి ఆ మిశ్ర‌మాన్ని పాల‌లో వేసి మ‌రిగించాలి. ఆ పాల‌ను వ‌డ‌క‌ట్టి కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే గొంతు బొంగురు త‌గ్గి గొంతు సాఫీగా అవుతుంది. ఖ‌ర్ఝూర గింజ‌ల‌ను నీటితో అర‌గదీసి ఆ మిశ్ర‌మాన్ని 2 గ్రాముల మోతాదులో ఒక‌గ్లాస్ నీటిలో క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల మూత్ర విస‌ర్జ‌న సాఫీగా సాగుతుంది. ఈ విధంగా ఖ‌ర్జూర పండ్లు మ‌న‌కు ఔష‌ధంగా కూడా ప‌నికి వ‌స్తాయ‌ని నిపుణులు చెబుతున్నారు.

Tags: dates
Previous Post

Sorakaya Payasam : సొర‌కాయ‌తో పాయ‌సం కూడా త‌యారు చేయ‌వ‌చ్చు.. ఎలాగంటే..?

Next Post

Figs : అంజీరాల‌ను ఈ సీజ‌న్‌లో తీసుకోవ‌డం మ‌రిచిపోకండి.. ఎంతో మేలు జ‌రుగుతుంది..!

Related Posts

హెల్త్ టిప్స్

మీరు బాదం పప్పు డైరెక్ట్ గా తింటునారా?..ఇకపై నీటిలో నానపెట్టి తినండి.. ఎందుకంటే!

July 21, 2025
హెల్త్ టిప్స్

మీ పిల్ల‌లు నిద్ర‌లో క‌ల‌వ‌రిస్తున్నారా..? అయితే ఇలా చేయండి..!

July 21, 2025
హెల్త్ టిప్స్

డిప్రెష‌న్ స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఇలా చేస్తే ఫ‌లితం ఉంటుంది..!

July 21, 2025
పోష‌ణ‌

వ‌ర్షాకాలంలో విట‌మిన్ డి ల‌భించాలంటే ఇలా చేయండి..!

July 21, 2025
vastu

ఈ ప‌నులు చేస్తున్నారా..? అయితే మీ ఇంట్లో ప్ర‌తికూల శ‌క్తులు తిరుగుతాయి జాగ్ర‌త్త‌..!

July 21, 2025
lifestyle

గురువారం నాడు త‌ల‌స్నానం అస‌లు చేయ‌కూడ‌ద‌ట‌.. ఎందుకంటే..?

July 21, 2025

POPULAR POSTS

మొక్క‌లు

Chitlamadha Plant : ర‌హ‌దారుల ప‌క్క‌న క‌నిపించే మొక్క ఇది.. క‌నిపిస్తే అస‌లు విడిచిపెట్టొద్దు.. ఎందుకంటే..?

by D
December 2, 2022

...

Read more
చిట్కాలు

Swollen Uvula Home Remedies : కొండ నాలుక వాపు వ‌చ్చిందా.. పొడ‌వుగా పెరిగిందా.. ఈ చిట్కాల‌ను పాటిస్తే త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది..

by D
November 12, 2022

...

Read more
పోష‌కాహారం

శ‌న‌గ‌ల‌ను తిన‌డం వ‌ల్ల క‌లిగే 5 అద్భుత‌మైన లాభాలు

by Admin
July 1, 2021

...

Read more
మొక్క‌లు

Amrutha Kada : మ‌న చుట్టూ ప‌రిస‌రాల్లో పెరిగే మొక్క ఇది.. క‌నిపిస్తే త‌ప్ప‌క ఇంటికి తెచ్చుకోండి..!

by D
June 7, 2022

...

Read more
ఆధ్యాత్మికం

Tathastu Devathalu : త‌థాస్తు దేవ‌త‌లు అస‌లు ఎవ‌రు ? వీరు రోజులో ఏ స‌మ‌యంలో తిరుగుతుంటారో తెలుసా ?

by D
May 27, 2022

...

Read more
వార్త‌లు

మ‌లం న‌లుపు రంగులో వ‌స్తే ఏం జ‌రుగుతుంది..? త‌ప్ప‌నిస‌రిగా తెలుసుకోవాల్సిన విష‌యాలు..!

by Admin
May 15, 2024

...

Read more
  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

© 2025. All Rights Reserved. Ayurvedam365.

No Result
View All Result
  • హెల్త్ టిప్స్
  • చిట్కాలు
  • వైద్య విజ్ఞానం
  • ఆహారం
  • పోష‌ణ‌
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • జ్యోతిష్యం & వాస్తు
  • ఆఫ్ బీట్
  • వినోదం

© 2025. All Rights Reserved. Ayurvedam365.