Sleeplessness : ఉరుకుల పరుగుల జీవితంలో కంటి నిండా నిద్రా కోరుకోవడం అత్యాశైపోతుంది. మాయిగా నిద్రపోయే వారిని అదృష్టవంతులు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రతి మనిషి రోజుకు 6 నుండి 8 గంటల నిద్ర చాలా అవసరం. అది లేకపోతే ఆరోగ్యపరంగా ఎన్నో సమస్యలు ఎదరవుతాయి. ముఖ్యంగా ఎక్కువ దూరం ప్రయాణించే వారు, ఎక్కువ సమయం కంప్యూటర్ ముందు నిద్రించే వారు కనీసం ఏడు గంటలు నిద్రించాలి. పగలంతా కష్టపడి అలసిపోయి ఇంటికి వచ్చి నిద్రపోదామంటే సరైన సమయానికి నిద్ర రాక ఇబ్బందులు పడుతూ ఉంటారు. కొంతమంది బెడ్ మీద పడుకున్న తరువాత నిద్ర పోవడానికి గంట పడుతుంది. నిద్ర పోయే సమయం నిద్ర లేచే సమయం మారకుండా చూసుకోవాలి. పగటిపూట కునుకు మానేయాలి.
రాత్రిపూట భోజనం తేలికగా ఉండేలా చూసుకోవాలి. నిద్రవ్యవస్థ చురుకుగా పని చేసేటప్పుడు పడుకోవడం కష్టం. నిద్ర పట్టని సమస్య ఉన్న వారు సాయంత్నం పూట యోగా, వ్యాయామాలు, వాకింగ్ లాంటివి అలవాటు చేసుకోవాలి. కొన్నిసార్లు నిద్రపట్టకపోవడానికి స్థూలకాయం, దీర్ఘకాలిక నొప్పులు, ఆందోళన, హైపర్ యాక్టివిటి వంటివి కూడా కారణాలు అవుతాయి. మెలటోనిన్ సహజమైన హార్మోన్. ఇది మనం సమయానికి నిద్రపోయేలా చేస్తుంది. అంతేకాదు నిద్ర నుండి లేవడాన్ని ఈ హార్మోనే క్రమబద్దీకరిస్తుంది. నిద్ర పట్టడానికి పాలు తాగడం అనేది ఎప్పటి నుండో వస్తున్న అలవాటని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పాలు తాగడం వల్ల ఆందోళన తగ్గతుందట.
కాబట్టి నిత్యం పడుకునే ముందు పాలు తాగి పడుకుంటే ఎంతో మంచిది. ఇదే కాకుండా మరో అద్భుతమైన ఇంటి చిట్కాను ఉపయోగించి కూడా మనం నిద్రలేమి సమస్యను దూరం చేసుకోవచ్చు. నిద్రలేమితో బాధపడే వారు ఈ చిట్కాను పాటించడం వల్ల చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమిని దూరం చేసే ఈ చిట్కాను ఎలా తయారు చేసుకోవాలి.. దీనికి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిద్రలేమిని దూరం చేసే ఈ చిట్కాను తయారు చేసుకోవడానికి తొక్క తీయని అరటి పండు ఒకటి, నీళ్లు, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, రుచికి తగినంత షుగర్ ఫ్రీ పంచదారను ఉపయోగించాల్సి ఉంటుంది. ముందుగా అరటి పండును తొక్కతో సహా శుభ్రంగా కడిగి చివర్లను తొలగించాలి. తరువాత ఈ అరటి పండును గుండ్రటి ముక్కలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి.
తరువాత ఒక గిన్నెలో ఒక గ్లాస్ నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక అరటి పండు ముక్కలను వేసి 10 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత దాల్చిన చెక్క పొడిని వేసి కలపాలి. ఈ నీటిని మరో 5 నిమిషాల పాటు మరిగించాలి. తరువాత వడకట్టి ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. రుచికి కొరకు షుగర్ ఫ్రీ పంచదారను వాడుకోవచ్చు. సాధారణ పంచదారను ఉపయోగించకూడదు. ఈ నీటిని రాత్రి పడుకునే ముందు తాగాలి. ఈ నీటిని తాగడం వల్ల నిద్ర బాగా పడుతుంది. అదేవిధంగా కాఫీ, టీ లను ఎక్కువగా తాగడం, వాతాన్ని పెంచే ఆహారాన్ని తీసుకోవడం, డైటింగ్ పేరుతో అర్థాకలితో రాత్రులు పడుకోవడం.. ఇవి అన్న కూడా నిద్రాభంగానికి కారణాలే. కనుక ఈ చిట్కాలను పాటిస్తూ తగిన జాగ్రతలను తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య నుండి ఉపశమనం కలుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు.