Banana : అరటి పండు.. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఇది కూడా ఒకటి. దీనిని మనలో చాలా మంది ఇష్టంగా తింటారు. అరటి పండులో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఎటువంటి రకం అరటి పండును తిన్నా కూడా మన ఆరోగ్యానికి మేలు కలుగుతుంది. అరటి పండును తినడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యి సుఖ విరేచనం అవ్వాలన్నా, రక్తహీనత సమస్య తగ్గాలన్నా అరటి పండును తినాలని వైద్యులు చెబుతున్నారు.
ఆరోగ్యం బాగాలేని వారికి అరటి పండు చక్కని ఆహారమని మనం ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. అరటి పండును తినడం వల్ల ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత లభిస్తుంది. నీరసంగా ఉన్నప్పుడు ఒక్క అరటి పండును తినడం వల్ల తక్షణ శక్తి లభిస్తుంది. పొగ త్రాగడం మానేయాలనుకునే వారు అరటి పండును తినడం వల్ల చక్కటి ఫలితం ఉంటుంది. ఎముకలను దృఢంగా ఉంచడంలో, వాతావరణ మార్పుల వల్ల కలిగే అనారోగ్య సమస్యల బారిన పడకుండా చేయడంలో కూడా అరటి పండు మనకు ఉపయోగపడుతుంది.
స్త్రీలల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పులను తగ్గించడంలో, దోమ కాటు వల్ల వచ్చే దురదను తగ్గించడంలో కూడా అరటి పండు మనకు సహాయపడుతుంది. ఇవే కాకుండా అరటి పండుకు హార్ట్ ఎటాక్ లను నివారించే గుణం కూడా ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. మనం అరటి పండును ఇతర పండ్ల వలే ఒక పండుగా చూస్తాం. కానీ ఇతర పండ్లల్లో లేనన్ని ఔషధ గుణాలు అరటి పండులో ఉన్నాయి. ప్రతిరోజూ మూడు అరటి పండ్లను తినడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
రోజూ మూడు పూటలా మూడు అరటి పండ్లను తినడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. ఇలా తినడం వల్ల మన శరీరంలో ఉండే పొటాషియం శాతం పెరుగుతుంది. అంతేకాకుండా మెదడు మరియు రక్త సంబంధిత రోగాలు వచ్చే అవకాశం 21 శాతం వరకు తగ్గుతుందని పరిశోధకులు తెలియజేస్తున్నారు. గుండె పోటుతో మరణించే వారి సంఖ్య ప్రస్తుత కాలంలో రోజు రోజుకు పెరుగుతుంది. రోజూ మూడు అరటి పండ్లను తింటే గుండె పోటు, రక్తపోటు వంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అరటి పండును తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుందని దీనిని తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని వారు సూచిస్తున్నారు.