పండ్లు

12 రకాల క్యాన్సర్లకు చెక్‌ పెట్టే లక్ష్మణ ఫలం.. ఇంకా ఏమేం లాభాలు కలుగుతాయంటే..?

సీతాఫలం లాగే మనకు లక్ష్మణఫలం కూడా లభిస్తుంది. మన దేశంతోపాటు బ్రెజిల్‌లోనూ ఈ పండు ఎక్కువగా పండుతుంది. క్యాన్సర్‌ పేషెంట్లకు దీన్ని ఒక వరంగా చెబుతారు. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, పోషక విలువలు అధికంగా ఉంటాయి. టీబీ, క్యాన్సర్‌, ఎయిడ్స్‌ వంటి వ్యాధులు ఉన్నవారికి ఈ పండు మేలు చేస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. ఈ పండు వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of lakshmana phalam

1. లక్ష్మణఫలానికి 12 రకాలకు పైగా క్యాన్సర్లను తగ్గించే శక్తి ఉందని చెబుతారు. పెద్దపేగు, బ్రెస్ట్‌, ప్రోస్టేట్‌, లంగ్‌, పాంక్రియాటిక్‌ వంటి క్యాన్సర్లు రాకుండా చూస్తుంది. శరీరంలోని క్యాన్సర్‌ కణాలను నాశనం చేసే ఔషధ గుణాలు ఈ పండులో ఉంటాయి.

2. మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు ఉన్నవారు ఈ పండును తీసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఆ ఇన్‌ఫెక్షన్లను రాకుండా చూస్తుంది. ఈ పండులో విటమిన్‌ సి అధికంగా ఉంటుంది. అందువల్ల యూరినరీ ట్రాక్ట్‌ ఇన్‌ఫెక్షన్లు రావు.

3. లక్ష్మణ ఫలంలో కాల్షియం, ఫాస్ఫరస్‌ అధికంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి. దీంతో ఆస్టియోపోరోసిస్‌ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. నొప్పులు తగ్గుతాయి.

4. లక్ష్మణ ఫలంలో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. ఇది మలబద్దకం సమస్యను తగ్గిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగు పరుస్తుంది.

5. శరీరంలో పొటాషియం స్థాయిలు తగ్గితే కాళ్లు పట్టుకుపోతుంటాయి. కానీ లక్ష్మణ ఫలంలో కాల్షియం, మెగ్నిషియం, సోడియంలతోపాటు పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఆ సమస్య నుంచి బయట పడవచ్చు.

6. శరీరంలో ద్రవాలు కొందరికి ఎక్కువగా చేరుతుంటాయి. అలాంటి వారు లక్ష్మణ ఫలం తింటే మంచిది. దీంతో ద్రవాలు సమతుల్యంలో ఉంటాయి. వాపులు తగ్గుతాయి.

7. బాగా అలసిపోయినవారు లక్ష్మణ ఫలం తింటే వెంటనే శక్తిని పుంజుకుంటారు. ఈ పండులో బి విటమిన్లు ఉంటాయి. ఇవి శక్తి ఉత్పత్తిని పెంచుతాయి. దీంతో శక్తి బాగా లభిస్తుంది. యాక్టివ్‌గా మారుతారు.

8. లక్ష్మణ ఫలంలో ఉండే మెగ్నిషియం, మాంగనీస్‌, కాపర్‌, జింక్‌లు ఎముకలను దృఢంగా మారుస్తాయి. శరీరం విటమిన్‌ డిని తయారు చేసేలా చూస్తాయి. దీంతో ఎముకలు దృఢంగా, ఆరోగ్యంగా ఉంటాయి.

9. లక్ష్మణ ఫలంలో ట్రిప్టోఫాన్‌ ఉంటుంది. ఇది చక్కని నిద్ర వచ్చేందుకు దోహదపడుతుంది. నిద్రలేమి సమస్య ఉన్నవారు ఈ పండును తింటే ఆ సమస్య నుంచి బయట పడవచ్చు. అలాగే బీపీ అదుపులో ఉంటుంది.

10. కొలెస్ట్రాల్‌ స్థాయిలు అధికంగా ఉన్నవారు ఈ పండును తినాలి. దీంతో శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ (ఎల్‌డీఎల్) తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్‌ (హెచ్‌డీఎల్‌) స్థాయిలు పెరుగుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది.

11. నోట్లో పుండ్లు, పొక్కులు ఉన్నవారు లక్ష్మణ ఫలాన్ని పేస్ట్‌ చేసి ఆయా భాగాలపై రాయాలి. దీంతో పుండ్లు మానుతాయి.

12. రక్తహీనత సమస్య ఉన్నవారు లక్ష్మణ ఫలాన్ని తినాలి. ఇందులో రైబోఫ్లేవిన్‌ ఉంటుంది. ఇది తలనొప్పిని తగ్గిస్తుంది.

ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మ‌మ్మ‌ల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365

Admin

Recent Posts