పండు బొప్పాయి మాత్ర‌మే కాదు, ప‌చ్చి బొప్పాయితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.. అవేమిటో తెలుసా ?

సాధార‌ణంగా చాలా మంది బొప్పాయి పండ్ల‌ను బాగా పండిన‌వి తింటుంటారు. అయితే నిజానికి ప‌చ్చి బొప్పాయిల‌ను కూడా తిన‌వ‌చ్చు. వీటితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

పండు బొప్పాయి మాత్ర‌మే కాదు, ప‌చ్చి బొప్పాయితోనూ అద్భుత‌మైన లాభాలు క‌లుగుతాయి.. అవేమిటో తెలుసా ?

1. ప‌చ్చి బొప్పాయిల్లో చ‌క్కెర శాతం త‌క్కువ‌గా ఉంటుంది. పండే కొద్దీ చ‌క్కెర శాతం పెరుగుతుంది. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల శ‌క్తి ఎక్కువ‌గా ల‌భిస్తుంది. వాటిలో ఫైబ‌ర్ అధికంగా, కొవ్వు త‌క్కువ‌గా ఉంటుంది.

2. ప‌చ్చి బొప్పాయిల‌లో పొటాషియం, మెగ్నిషియం, ఫాస్ఫ‌ర‌స్‌, సోడియం వంటి మిన‌ర‌ల్స్ అధికంగా ఉంటాయి. ప‌పైన్‌, కైమోప‌పెయిన్ వంటి ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు ఎంత‌గానో మేలు చేస్తాయి.

3. ప‌చ్చి బొప్పాయిల‌లో స‌హ‌జ‌సిద్ధ‌మైన లేటెక్స్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీరం శుభ్రంగా మారుతుంది. శరీరంలోని వ్య‌ర్థాలు బ‌య‌ట‌కు పోతాయి.

4. ప‌చ్చి బొప్పాయిల‌లో బీటా కెరోటీన్, లైకోపీన్ అధికంగా ఉంటాయి. పండు బొప్పాయిల్లో క‌న్నా అవి ప‌చ్చి బొప్పాయిల్లోనే ఎక్కువ‌గా ఉంటాయి. అందువ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. కంటి చూపు మెరుగు ప‌డుతుంది. కంటి స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

5. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల జీర్ణ‌వ్య‌వ‌స్థ‌కు చెందిన స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి. అజీర్ణం, గుండెల్లో మంట‌, క‌డుపు ఉబ్బ‌రం, మ‌ల‌బ‌ద్ద‌కం, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్ త‌గ్గుతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌లో ఉండే పురుగులు చ‌నిపోతాయి. ప‌చ్చి బొప్పాయిలో ఉండే ప‌పైన్‌, కైమోపపైన్ అనే ఎంజైమ్‌లు సూక్ష్మ క్రిముల‌ను నాశ‌నం చేస్తాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ‌ను ఆరోగ్యంగా ఉంచుతాయి.

6. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. ప‌చ్చి బొప్పాయిల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లయిన సాపోనిన్స్‌, టానిన్స్‌, బీటా కెరోటిన్, ఫ్లేవ‌నాయిడ్స్ రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేస్తాయి. దీని వ‌ల్ల శ‌రీరంలో చేరే సూక్ష్మ క్రిముల‌పై పోరాటం చేస్తాయి. వ్యాధులు, ఇన్‌ఫెక్ష‌న్లు రాకుండా చూస్తాయి.

7. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూస్తాయి. గుండె ఆరోగ్య‌క‌ర‌మైన రీతిలో కొట్టుకుంటుంది.

8. ప‌చ్చిబొప్పాయిల‌ను తింటే క్యాన్స‌ర్ వ‌చ్చే అవ‌కాశాలు త‌గ్గుతాయి. పెద్ద పేగు శుభ్ర‌మ‌వుతుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారికి ఎంతో మేలు జ‌రుగుతుంది. షుగ‌ర్ లెవ‌ల్స్ తగ్గుతాయి.

9. అధిక బ‌రువు స‌మ‌స్య‌తో బాధ‌ప‌డ‌తున్న‌వారు ప‌చ్చి బొప్పాయిల‌ను తింటే త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. గాయాలు, పుండ్లు అయిన వారు ఈ కాయ‌ల‌ను తింటుంటే అవి త్వ‌ర‌గా మానుతాయి.

10. ప‌చ్చి బొప్పాయిల‌ను తిన‌డం వ‌ల్ల బాలింత‌ల్లో పాలు బాగా ఉత్ప‌త్తి అవుతాయి.

ప‌చ్చి బొప్పాయిల‌ను ఫ్రూట్ స‌లాడ్‌, సూప్స్ లో క‌లిపి తీసుకోవ‌చ్చు. కొంద‌రు వీటితో ప‌చ్చ‌ళ్లు పెట్టుకుంటారు. కొంద‌రు కూర‌లు, చ‌ట్నీలు చేసుకుంటారు. మాంసాహారాల్లోనూ ప‌చ్చి బొప్పాయి ముక్క‌ల‌ను వేసి వండుతారు.

Admin

Recent Posts