ఎరుపు రంగులో చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఉండే పండ్లలో స్ట్రాబెర్రీలు ఒకటి. ఇవి చక్కని రుచిని కలిగి ఉంటాయి. వీటిల్లో అనేక పోషకాలు ఉంటాయి. స్ట్రాబెర్రీలను సౌందర్య సాధన ఉత్పత్తుల తయారీలోనూ ఉపయోగిస్తారు. వీటిని తరచూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. వీటిని తినడం వల్ల ఎలాంటి ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. స్ట్రాబెర్రీలలో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. గుండె జబ్బులు, క్యాన్సర్ రాకుండా చూస్తుంది. ఈ పండ్లలో ఉండే పొటాషియం గుండె జబ్బులు రాకుండా గుండెను సంరక్షిస్తుంది. హైబీపీని తగ్గిస్తుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల హార్ట్ ఎటాక్ లు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. అందువల్ల ఈ పండ్లను తరచూ తినడం ఎంతో మంచిది.
2. రోజూ 50 గ్రాముల స్ట్రాబెర్రీలను తినడం వల్ల రక్తంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు గణనీయంగా తగ్గుతాయని సైంటిస్టుల పరిశోధనలో వెల్లడైంది. అందువల్ల స్ట్రాబెర్రీలను తింటే కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుకోవచ్చు. దీంతో హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు.
3. స్ట్రాబెర్రీలను తినడం వల్ల పలు రకాల క్యాన్సర్లు రాకుండా అడ్డుకోవచ్చు. ముఖ్యంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఈ విషయాన్ని సైంటిస్టులు తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.
4. స్ట్రాబెర్రీలలో ఉండే ఫైబర్ జీర్ణవ్యవస్థలో మంచి బాక్టీరియాకు తోడ్పాటును అందిస్తుంది. దీంతో జీర్ణ సమస్యలు ఉండవు. ముఖ్యంగా మలబద్దకం తగ్గుతుంది.
5. గ్యాస్ సమస్యలు ఉన్నవారు స్ట్రాబెర్రీలను తింటుంటే ఫలితం కనిపిస్తుంది. స్ట్రాబెర్రీలను తినడం వల్ల రోగ నిరోధక శక్తిని పెంచుకోవచ్చు.
6. ఈ పండ్లను తింటే మెదడు చురుగ్గా మారుతుంది. యాక్టివ్‌గా ఉంటుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుతాయి. చిన్నారులకు ఈ పండ్లను తినిపిస్తే వారిలో తెలివితేటలు పెరుగుతాయి.
7. అధిక బరువును తగ్గించడంలోనూ స్ట్రాబెర్రీలు దోహదపడతాయి. వీటిని తింటుంటే కొవ్వు కరిగి అధిక బరువు తగ్గుతారు. గర్భిణీలు ఈ పండ్లను తినడం వల్ల పుట్టబోయే పిల్లల్లో లోపాలు రాకుండా ఉంటాయి.
రోజూ ఒక కప్పు మోతాదులో స్ట్రాబెర్రీలను తీసుకోవడం వల్ల పైన తెలిపిన ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. వీటిని సలాడ్ రూపంలోనూ తీసుకోవచ్చు. సాయంత్రం జంక్ ఫుడ్ తినేబదులు వీటిని తింటే మంచిది.
ఎప్పటికప్పుడు అప్‌డేట్స్ కోసం టెలిగ్రామ్‌లో మమ్మల్ని ఫాలో అవ్వండి: Ayurvedam365