Mangoes : మామిడి పండ్లు.. వేసవి రాగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేవి ఇవే. మామిడిపండ్లను ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. సీజన్ రాగానే వీటిని బయట నుండి కొనుగోలు చేసి మరీ మనం ఈ పండ్లను తింటూ ఉంటాం. ఎవరైనా తియ్యటి మామిడి పండ్లనే కొనుగోలు చేయాలని చూస్తూ ఉంటారు. కానీ వ్యాపారులు చెప్పిన మాటలు నమ్మి చాలా మంది పుల్లటి మామిడి పండ్లను కొనుగోలు చేస్తారు. మామిడి పండ్లను కొనుగోలు చేసే క్రమంలో చాలా మంది మోసపోతూ ఉంటారు. అయితే కొన్ని చిట్కాలను పాటించడం వల్ల మనం చాలా సులభంగా తియ్యటి మామిడికాయలను కొనుగోలు చేయవచ్చు. ఈ చిట్కాలను పాటించడం వల్ల మనం ఎప్పుడూ కూడా తియ్యటి మామిడి పండ్లనే ఇంటికి తీసుకు రావచ్చు.
మామిడి పండ్లను కొనుగోలు చేసేటప్పుడు వాటి బొడిపె దగ్గర జాగ్రత్తగా పరిశీలించాలి. మామిడి పండుకు, కాండానికి ఉండే జాయింట్ వద్ద జాగ్రత్తగా పరిశాలించాలి. ఈ జాయింట్ దగ్గర భాగం కొద్దిగా లోపలికి ఉండి చుట్టూ ఉండే భాగంలో పైకి ఉన్నట్టయితే మామిడి పండు తియ్యగా ఉంటుందని చక్కగా పండిందని అర్థం. కొన్నిసార్లు మామిడి పండు బొడిపె భాగం లోపలికి ఉండి చుట్టూ భాగం మరీ పైకి లేదా విడిపోయినట్టు ఉంటే మామిడి పండు పెద్దగా ఉన్నట్టు లేదా మామిడి పండు పండి చాలా కాలం అయినట్టు అర్థం. ఇలా ఉండే మామిడి పండ్లు పండినప్పటికి ఇవి అంత తియ్యగా ఉండవు. ఇప్పుడు మామిడి కాయ కింది భాగాన్ని చూడాలి.మామిడి కాయ కింది భాగంలో నల్లగా లేదా ముదురు రంగులో ఉంటే అవి తాజాగా పండిన మామిడి కాయలు కాదని అర్థం. ఇలా ఉండే మామిడి కాయలు పాతవని అలాగే అవి ఎండిపోవడానికి సిద్దంగా ఉన్నాయని అర్థం.
ఇలాంటి మామిడి పండ్లు చూడడానికి చక్కగా ఉన్నప్పటికి ఇవి అంత తియ్యగా ఉండవు. అలాగే మామిడి పండ్లను కొనేటప్పుడు వాటిని కొద్దిగా నొక్కి చూడాలి. మామిడి పండ్లను కొద్దిగా నొక్కగానే వాటి నుండి ఎటువంటి నీరు రాదు. వాటిపై ఉండే తొక్క కూడా చిరిగిపోదు. ఇలాంటి పండ్లు తాజాగా పండిన మామిడి పండ్ల లాగా అర్థం చేసుకోవాలి. అలాగే మామిడి పండ్లను కొనేటప్పుడు వాటి వాసనను చూడాలి. తియ్యటి మామిడి పండ్లు చక్కటి వాసనను కలిగి ఉంటాయి. చక్కగా పండని మామిడి పండ్లు వెనిగర్ వాసనను కలిగి ఉంటాయి. మామిడి పండ్లను కొనేటప్పుడు ఈ చిట్కాలను గుర్తుంచుకుని కొనుగోలు చేయడం వల్ల మనం ఎప్పుడూ కొనుగోలు చేసిన చక్కటి మామిడి పండ్లనే కొనుగోలు చేయవచ్చు.