Mangoes : మామిడి పండ్లు.. వీటిని ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. వేసవికాలం రాగానే అందరికి ముందుగా గుర్తుకు వచ్చేవి ఇవేనన్ని చెప్పవచ్చు. పండ్లకు రారాజుగా మామిడిపండును పిలుస్తూ ఉంటారు. మనకు వివిధ రుచుల్లో ఈ మామిడి పండ్లు లభిస్తూ ఉంటాయి. వీటిని నేరుగా తినడంతో పాటు వీటితో జ్యూస్ లను, మిల్క్ షేక్ లను, స్యూతీలను తయారు చేస్తూ ఉంటారు. వీటిని అనేక రూపాల్లో తీసుకుంటూ ఉంటారు. మామిడిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని మన ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో సహాయపడతాయి. మామిడిపండ్లల్లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి. అలాగే దీనిలో ఉండే విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరచడంలో, చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో దోహదపడతాయి.
అంతేకాకుండా దీనిలో పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం ఇలా అనేక రకాలు మినరల్స్ ఉంటాయి. మామిడిపండ్లను తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. మామిడిపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయినప్పటికి వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వివిధ దుష్ప్రభావాల బారిన పడాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు. 100 గ్రాముల మామిడిపండులో 8.2 గ్రాముల కార్బోహైడ్రేట్స్, దాదాపు 45 క్యాలరీల శక్తి ఉంటుంది. ఒకరు దాదాపు రోజుకు 300 నుండి 350 గ్రాముల మామిడిపండ్లను తీసుకునే అవకాశం ఉంది. ఇలా అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మామిడిపండ్లల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
అయితే మామిడిపండ్లను అధికంగా తీసుకోవడం వల్ల కడుపు ఉబ్బరం, మలబద్దకం, కడుపులో నొప్పి వంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మామిడిపండ్లను అధికంగా తీసుకోవడం వల్ల అలర్జీలు, దురదలు, దద్దుర్లు వంటి సమస్యలు తలెత్తే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని అధిక మొత్తంలో తీసుకోవడం వల్ల శ్వాస సమస్యలు వచ్చే అవకాశం కూడా ఉంది. మామిడిపండ్లల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అయితే అధిక మొత్తంలో వీటిని తీసుకోవడం వల్ల శరీరానికి అధిక మొత్తంలో క్యాలరీలు అదుతాయి. దీంతో బరువు పెరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారు మామిడి పండ్లను వారానికి రెండు నుండి మూడు సార్లు మాత్రమే తీసుకోవాలి.
అది కూడా 100 నుండి 150 గ్రాముల మోతాదులో మాత్రమే తీసుకోవాలి. మామిడి పండ్లల్లో చక్కెర శాతం ఎక్కువగా ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మామిడిపండ్లను తినే గంట ముందు నీటిలో నానబెట్టి తీసుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఇలా నానబెట్టి తీసుకోవడం వల్ల మామిడి పండ్లను తినప్పటికి శరీరంలో వేడి చేయకుండా ఉంటుంది. మామిడిపండ్లు మన ఆరోగ్యానికి మేలు చేసేవే అయినప్పటికి వీటిని తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.