Peaches : ఈ పండ్ల గురించి తెలుసా.. కంటి చూపు పెరుగుతుంది.. గుండె సేఫ్‌..!

Peaches : మ‌నం ఆహారంగా తీసుకునే రుచిక‌ర‌మైన పండ్ల‌ల్లో పీచ్ పండ్లు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ పండ్లు మ‌న‌కు విరివిరిగా ల‌భిస్తున్నాయి. ఈ పీచ్ పండ్లు రుచిగా ఉండ‌డంతో పాటు వీటిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న శ‌రీర ఆరోగ్యం ఎంతో మెరుగుప‌డుతుంది. ఆ పండ్ల‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే మిన‌ర‌ల్స్ తో విట‌మిన్ సి, విట‌మిన్ ఎ, విట‌మిన్ ఇ, నియాసిస్ వంటి ఎన్నో పోష‌కాలు ఉన్నాయి. ఈ పోష‌కాలు శ‌రీర ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, శ‌రీరంలో జీవ‌క్రియ‌లు స‌క్ర‌మంగా జ‌రిగేలా చేయ‌డంలో ఎంతో స‌హాయ‌ప‌డ‌తాయి. అలాగే ఈ పీచ్ పండ్లల్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.

ఇవి శ‌రీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్ ను న‌శింప‌జేసి క‌ణాల ఆరోగ్యాన్ని కాపాడ‌తాయి. ఈ పండ్ల‌ను ఆహారంగా భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. క్యాన్స‌ర్ వంటి ప‌లు ప్రాణాంత‌క వ్యాధుల బారిన ప‌డ‌కుండా ఉంటాము. అలాగే ఈ పండ్ల‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. ఈ పండ్ల‌ను తిన‌డం వల్ల జీర్ణ‌శ‌క్తి మెరుగుప‌డుతుంది. మ‌ల‌బద్ద‌కం స‌మ‌స్య త‌గ్గుతుంది. జీర్ణ‌స‌మ‌స్య‌లు మ‌న ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌ల్లో నీటి శాతం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక ఈ పండ్ల‌ను తిన‌డం వ‌ల్ల శ‌రీరం డీహైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. అదే విధంగా కంటి చూపును మెరుగుప‌ర‌చ‌డంలో కూడా పీచ్ పండ్లు మ‌న‌కు ఎంత‌గానో స‌హాయ‌ప‌డ‌తాయి.

Peaches help protect heart and improves vision
Peaches

పీచ్ పండ్ల‌ల్లో విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, బీటా కెరోటిన్ వంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి. ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల కంటి ఆరోగ్యం, కంటి చూపు మెరుగుపడుతుంది. వ‌య‌సు పైబ‌డ‌డం వ‌ల్ల వ‌చ్చే కంటి స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. అలాగే ఈ పండ్ల‌ల్లో పొటాషియం కూడా ఉంటుంది. క‌నుక ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్త‌పోటు అదుపులో ఉంటుంది. ర‌క్త‌పోటు అదుపులో ఉండ‌డం వ‌ల్ల గుండె కూడా ఆరోగ్యంగా ప‌ని చేస్తుంది. అలాగే బ‌రువు త‌గ్గాల‌నుకునే ఈ పీచ్ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది. ఈ పండ్లల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది క‌నుక ఈ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఆక‌లి త్వ‌ర‌గా వేయదు.

దీంతో మ‌నం తీసుకునే క్యాలరీల సంఖ్య త‌గ్గుతుంది. త‌ద్వారా మ‌నం సుల‌భంగా బ‌రువు త‌గ్గ‌వ‌చ్చు. మ‌న శ‌రీర ఆరోగ్యానికే కాదు మ‌న చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో కూడా ఈ పండ్లు మ‌న‌కు ఎంతో దోహ‌ద‌ప‌డ‌తాయి. పీచ్ పండ్ల‌ను తీసుకోవ‌డం వ‌ల్ల చ‌ర్మ ఆరోగ్యం మెరుగుప‌డుతుంది. చ‌ర్మం ముడ‌త‌లు ప‌డ‌క‌రుండా ఉంటుంది. వృద్దాప్య ఛాయ‌లు మన ద‌రి చేర‌కుండా ఉంటాయి. అలాగే యువి కిర‌ణాల కారణంగా చ‌ర్మం దెబ్బ‌తిన‌కుండా ఉంటుంది. ఈ విధంగా పీచ్ పండ్లు మ‌న ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని వీటిని కూడా త‌ప్ప‌కుండా మ‌న రోజు వారి ఆహారంలో భాగంగా తీసుకోవాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts