Pineapple Juice : పైనాపిల్.. ఇది తెలియని వారుండరనే చెప్పవచ్చు. మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో ఇది ఒకటి. పైనాపిల్ తియ్యటి, పుల్లటి రుచులను కలిగి తిన్నా కొద్ది తినాలపించేంత రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. పైనాపిల్ లో ఎన్నో పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. విటమిన్ సి అధికంగా ఉండే పండ్లల్లో ఇది ఒకటి. దీనిలో ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ డి, విటమిన్ బి6 వంటి పోషకాలు ఎన్నో ఉన్నాయి. పైనాపిల్ ను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీరంలో ఫ్రీరాడికల్స్ తో పోరాడి క్యాన్సర్ బారిన పడే అవకాశాలను కూడా తగ్గిస్తాయి. కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కంటి చూపును పెంచడంలో కూడా పైనాపిల్ మనకు ఉపయోగపడుతుంది.
శరీరంలో నొప్పులను, వాపులను, ఆర్థరైటిస్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా ఇది మనకు దోహదపడుతుంది. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల ఎముకల బలంగా తయారవుతాయి. దీనిని ముక్కలుగా చేసి తీసుకున్నా లేదా జ్యూస్ గా చేసి తీసుకున్నా కూడా మనం చక్కటి ప్రయోజనాలను పొందవచ్చు. పైనాపిల్ జ్యూస్ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా తేలిక. పైనాపిల్ పై ఉండే చెక్కును తొలగించి ముక్కలుగా చేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత అందులో పంచదార లేదా తేనె వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గ్లాస్ లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పైనాపిల్ జ్యూస్ తయారవుతుంది. అయితే ఈ జ్యూస్ లో పంచదారను వేసుకోకపోవడమే చాలా మంచిది. దీనిలో చల్లదనం కోసం ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు.
ఈ విధంగా తయారు చేసిన పైనాపిల్ జ్యూస్ ను పిల్లలు ఇష్టంగా తాగుతారు. పైనాపిల్ ను తిన్నా లేదా జ్యూస్ గా చేసుకుని తాగినా మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. దీనిని తీసుకోవడం వల్ల శరీరంలో గాయాలు త్వరగా మానుతాయి. శరీరంలో రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపరిచి రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా చేయడంలో, జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, సైనస్ వంటి సమస్యలను తగ్గించడంలో కూడా పైనాపిల్ మనకు దోహదపడుతుంది. అయితే దీనిని గర్భిణీ స్త్రీలు మాత్రం తీసుకోకూడదు. పైనాపిల్ ను తీసుకోవడం వల్ల వారిలో గర్భస్రావం అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన ఆరోగ్యానికి మాత్రమే మన ముఖ సౌందర్యాన్ని మెరుగుపరచడంలో కూడా పైనాపిల్ మనకు సహాయపడుతుంది.
ఒక గిన్నెలో ఒక టేబుల్ స్పూన్ పైనాపిల్ గుజ్జు, 2 టీ స్పూన్ల కలబంద గుజ్జు, ఒకటి లేదా రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ను వేసి కలపాలి. తరువాత దీనిని ముఖానికి పట్టించి ఆరిన తరువాత నీటితో కడగాలి. ఇలా చేయడం వల్ల మొటిమలు, మచ్చలు, కళ్ల కింద నల్లటి వలయాలు, చర్మం పై ముడతలు వంటి సమస్యలు తగ్గుతాయి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది. ఈ విధంగా పైనాపిల్ మనకు ఎంతగానో ఉపయోగపడుతుందని దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.