Pink Guava Benefits : మనకు ఎల్లప్పుడూ సులభంగా విరివిగా తక్కువ ధరలో లభించే పండ్లల్లో జామపండ్లు కూడా ఒకటి. జామపండ్లు చాలా రుచిగాఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ఒక్కప్పుడు ప్రతి ఇంట్లో జామ చెట్టు ఉండేది. దాదాపు సంవత్సరమంతా ఈ పండ్లు మనకు లభిస్తూనే ఉంటాయి. జామపండ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. రోజూ ఒక జామపండును తప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. జామకాయలను తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. వీటిని ఎందుకు రోజూ తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
జామపండును సాధారణంగా పేదవాడి ఆపిల్ పండు అని పిలుస్తారు. ఖరీదైన పండ్లను తీసుకోవడం వల్ల కలిగే మేలు కేవలం జామపండును తీసుకోవడం వల్ల కలుగుతుంది. జామపండ్లను తీసుకోవడం వల్ల విరోచనాలు తగ్గుతాయి. శరీరంలో సోడియం, పొటాషియం స్థాయిలు అదుపులో ఉంటాయి. రక్తపోటు అదుపులో ఉంటుంది. రక్తప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అధిక రక్తపోటుతో బాధపడే వారు జామపండ్లను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. జామపండ్లను తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె జబ్బులు మన దరి చేరకుండా ఉంటాయి. రక్తంలో కొలెస్ట్రాల్, ట్రైగ్లిజరాయిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయి. జామపండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఇన్పెక్షన్ లు మన దరి చేరకుండా ఉంటాయి. అంటువ్యాధుల బారిన పడకుండా ఉంటాము. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. జామపండ్లను తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులు మన దరి చేరకుండా ఉంటాయి. బరువు తగ్గడంలో కూడా జామపండ్లు మనకు దోహదపడతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల కడుపు నిండిని భావన కలుగుతుంది. దీంతో మనం సులభంగా బరువు తగ్గవచ్చు. అంతేకాకుండా జామపండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. ఈ విధంగా జామపండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని రోజూ తప్పకుండా ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.