Pomegranate Facts : మనం ఆహారంగా తీసుకునే పండ్లల్లో దానిమ్మపండ్లు కూడా ఒకటి. ఈ పండ్లు మనకు దాదాపు అన్ని కాలాల్లో విరివిగా లభిస్తాయి. దానిమ్మపండ్లు తియ్యటి, పుల్లటి రుచుల్లో ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటూ ఉంటారు. అలాగే జ్యూస్ చేసి తీసుకుంటారు. వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. వైద్య నిపుణులు కూడా వీటిని ఆహారంలో భాగంగా చేసుకోవాలని సూచిస్తూ ఉంటారు. దానిమ్మపండ్లను తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. అనేక అనారోగ్య సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. దానిమ్మ పండ్లను ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. దానిమ్మకాయలల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
ఇవి కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో, ఫ్రీరాడికల్స్ నుండి శరీరాన్ని కాపాడడంలో దోహదపడతాయి. దానిమ్మ పండ్లల్లో యాంటీ ఇన్ ప్లామేటరీ గుణాలు కూడా ఉంటాయి. ఈ లక్షణాల కారణంగా వీటిని తీసుకోవడం వల్ల మనం క్యాన్సర్, గుండె జబ్బులు వంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాము. దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల రక్తనాళాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అధిక రక్తపోటు సమస్య అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గి మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. అదే విధంగా దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కణాలు దెబ్బతినకుండా కాపాడడంలో, అలాగే క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో దోహదపడతాయి.
క్యాన్సర్ కు వ్యతిరేకంగా పని చేసే గుణం కూడా దానిమ్మ పండ్లకు ఉంది. దానిమ్మ పండ్లను తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడు ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా దానిమ్మ పండ్లు మనకు సహాయపడతాయి. అలాగే వీటిని తీసుకోవడం వల్ల వీటిలో ఉండే ఫైబర్ జీర్ణశక్తిని మెరుగుపరచడంలో దోహదపడుతుంది. మలబద్దకం సమస్యతో బాధపడే వారు వీటిని తీసుకోవడం వల్ల మంచి పలితం ఉంటుంది. ఈ విధంగా దానిమ్మ పండ్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తప్పకుండా ప్రతి ఒక్కరు ఆహారంలో భాగంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.