Pomegranate : దానిమ్మ పండు మన శరీరానికి ఎలా మేలు చేస్తుందో తెలుసా ?

Pomegranate : దానిమ్మ పండ్లు మనకు దాదాపుగా అన్ని సీజన్లలోనూ లభిస్తాయి. ఇది పెద్దగా ధర కూడా ఉండవు. సులభంగానే లభిస్తాయి. కనుక ఎవరైనా సరే వీటిని కొని తినవచ్చు. ఇవి చూసేందుకు ఎరుపు రంగులో ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తాయి. చూడగానే తినాలని అనిపిస్తుంది. అయితే దానిమ్మ పండ్లు మన శరీరానికి చేలు మేలు అంతా ఇంతా కాదు. వీటిని తినడం వల్ల మనకు అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలు కలుగుతాయి. అనేక పోషకాలు లభిస్తాయి. దానిమ్మ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. బాక్టీరియా, వైరస్‌ ఇన్‌ఫెక్షన్లను తగ్గిస్తాయి. క్యాన్సర్‌ కణాలు పెరగకుండా చూస్తాయి. కనుక ఈ పండ్లను తరచూ తినాలి.

Pomegranate helps in many ways take daily one
Pomegranate

దానిమ్మ పండ్లలో మన శరీరానికి కావల్సిన అనేక విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయి. ఇవి వాపులను తగ్గిస్తాయి. కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనాన్ని అందిస్తాయి. ఈ పండ్లను తినడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఉత్సాహంగా ఉంటారు. యాక్టివ్‌గా పనిచేస్తారు. బద్దకం రాదు. పిల్లల్లో అయితే ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి. చదువుల్లో రాణిస్తారు.

దానిమ్మ పండ్లను తినడం వల్ల శరీరంలో హార్మోన్లు సరిగ్గా పనిచేస్తాయి. దీంతో థైరాయిడ్ సమస్యలు తగ్గుతాయి. అలాగే స్త్రీలకు నెలసరి సరిగ్గా వస్తుంది. దానిమ్మ పండును రోజుకు ఒకటి తింటే నెల రోజుల్లో రక్తం బాగా తయారవుతుంది. రక్తహీనత తగ్గుతుంది. అలాగే గ్యాస్‌, అజీర్ణం, మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు తగ్గుతాయి. ఈ పండు గుండెకు ఎంతో మేలు చేస్తుంది. కొలెస్ట్రాల్‌, బీపీలను అదుపు చేస్తుంది. హార్ట్‌ ఎటాక్‌లు రాకుండా చూస్తుంది. కనుక దానిమ్మ పండ్లను రోజూ ఆహారంలో భాగం చేసుకోవాలి.

Editor

Recent Posts