Rama Phalam : మనకు ప్రతి సీజన్‌లోనూ వివిధ రకాల పండ్లు లభిస్తుంటాయి. సీజనల్‌గా లభించే పండ్లను తినడం వల్ల మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. ఇక మనకు చలికాలంలో లభించే పండ్లలో సీతాఫలాలు కూడా ఒకటి. అయితే వీటి లాగే రామఫలాలు కూడా ఉంటాయి. చాలా మందికి వీటి గురించి తెలియదు. వీటిని ఎప్పుడో ఒకసారి చూసి ఉంటారు. కానీ ఇవి రామఫలాలు అని చాలా మందికి తెలియదు. అయితే సీతాఫలం లాగే రామఫలాలు కూడా అద్భుతమైన పోషకాలను కలిగి ఉంటాయి. వీటిని తినడం వల్ల కూడా మనం ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. రామఫలాలను తింటే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
రామఫలాల్లో అనేక పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇవి షుగర్ ఉన్నవారికి మేలు చేస్తాయి. సీతాఫలాలను షుగర్ ఉన్నవారు ఎక్కువగా తినరాదని చెబుతుంటారు. కానీ రామఫలాలు అలా కాదు. షుగర్ ఉన్నవారు వీటిని భేషుగ్గా తినవచ్చు. దీంతో షుగర్ లెవల్స్ తగ్గుతాయి. డయాబెటిస్ అదుపులో ఉంటుంది. అలాగే ఈ పండ్లను తింటే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. వీటిల్లో అనేక రకాల బి విటమిన్లతోపాటు విటమిన్ ఎ కూడా అధికంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. సీజనల్ వ్యాధులు రాకుండా చూస్తుంది. దీంతో దగ్గు, జలుబు వంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. అలాగే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
రామఫలాలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. ఇవి మొటిమలను తగ్గిస్తాయి. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. మొటిమలు, మచ్చలు ఉండవు. రామఫలాలు శిరోజాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టు పెరిగేలా చేస్తాయి. దీంతో జుట్టు రాలడం తగ్గుతుంది. జుట్టు చివర్లు విరిగిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే జుట్టు సమస్యలు తగ్గుతాయి.
రామఫలాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయి. ఈ పండ్లలో విటమిన్ బి6 అధికంగా ఉంటుంది. ఇది రక్తనాళాల్లో ఉండే కొవ్వును కరిగిస్తుంది. దీంతో హార్ట్ ఎటాక్ లు రాకుండా అడ్డుకోవచ్చు. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. దీంతో ఉత్సాహంగా మారుతారు. అలాగే కిడ్నీ స్టోన్లు కూడా ఏర్పడకుండా ఉంటాయి. దీంతోపాటు ఈ పండ్లలో ఉండే ఐరన్ రక్తం అధికంగా తయారయ్యేలా చేస్తుంది. దీంతో రక్తహీనత నుంచి బయట పడవచ్చు. ఇలా రామఫలాలతో మనం అనేక ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఈ సీజన్‌లో వీటిని తప్పక తినాలి.