Rama Phalam Benefits : మనకు కాలానుగుణంగా లభించే పండ్లల్లో రామఫలం కూడా ఒకటి. ఈ ఫలం ఎక్కువగా మనకు శీతాకాలంలో లభిస్తుంది. రామఫలం చూడడానికి ఎర్రగా ఉంటుంది. ఈ ఫలం కూడా సీతాఫలం వలె చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది ఈ పండును ఇష్టంగా తింటారు. మనకు ఎక్కువగా అడువుల్లో ఈ రామఫలం లభిస్తుంది. అడవుల నుండి సేకరించి వీటిని పట్టణాల్లో అమ్ముతూ ఉంటారు. సీతాఫలం వలె రామఫలాన్ని కూడా ఆహారంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రామఫలంలో కూడా అనేక పోషకాలు, ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. రామఫలాన్ని తీసుకోవడం వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రామఫలాన్ని తీసుకోవడం వల్ల చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. జుట్టు చిట్లడం, రాలడం వంటివి తగ్గుతాయి. మొటిమలు తొలగిపోవడంతో పాటు చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వృద్దాప్య ఛాయలు మన దరి చేరకుండా ఉంటాయి. ముఖవచ్చస్సు మరింతగా పెరుగుతుంది. అదే విధంగా డయాబెటిస్ తో బాధపడే వారికి ఈ పండు ఎంతో మేలు చేస్తుంది. డయాబెటిస్ తో బాధపడే వారు పండ్లను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయని పండ్లకు దూరంగా ఉంటారు.కానీ వారు రామఫలాన్ని తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. రామఫలం డయాబెటిస్ వ్యాధితో బాధపడే వారికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు కూడా చెబుతున్నారు. అలాగే ఈ పండును తీసుకోవడం వల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. దీనిలో అధికంగా ఉండే విటమిన్ సి మనల్ని శీతాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యల నుండి కాపాడడంలో దోహదపడుతుంది.
ఇక రామఫలంలో యాంటీ ఇన్ ప్లామేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తీసుకోవడం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా మన శరీరంలో ఉండే ఫ్రీరాడికల్స్ కారణంగా శరీరానికి నష్టం కలగకుండా కాపాడడంలో కూడా ఈ పండ్లు మనకు దోహదపడతాయి. అదే విధంగా రామఫలాన్ని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. గుండె సంబంధిత సమస్యలు మన దరి చేరకుండా ఉంటాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వు కూడా కరిగిపోతుంది. అలాగే ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడే వారికి కూడా ఈ పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాలానుగుణంగా వచ్చే ఏ పండైనా మన ఆరోగ్యానికి మేలు చేసినట్టే రామఫలం కూడా మన ఆరోగ్యానికి మేలు చేస్తుందని ఈ పండ్లు ఎక్కువగా లభించినప్పుడు తప్పకుండా ఆహారంగా తీసుకోవాలని దీంతో కాలానుగుణంగా వచ్చే అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటామని నిపుణులు చెబుతున్నారు.