Sky Fruit : ఊబకాయం, భారీ ఊబకాయం వంటి సమస్యలతో నేటి తరుణంలో పురుషుల కంటే స్త్రీలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. అధిక బరువు వల్ల స్త్రీలల్లో హార్మోన్ల అసమతుల్యత తలెత్తుతుంది. అలాగే రుతుక్రమం కూడా దెబ్బతింటుంది. దీంతో పిసిఒడి, పిసిఒఎస్ వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలతో బాధపడే స్త్రీలకు వైద్యులు మెట్ పార్మిన్ వంటి డయాబెటిస్ మందులను కూడా ఇస్తూ ఉంటారు. అధిక బరువుతో బాధపడే స్త్రీలల్లో ఇన్సులిన్ ఉన్నప్పటికి అది పని చేయని స్థితిలో ఉంటుంది. వారిలో ఇన్సులిన్ నిరోధకత వస్తుంది. దీంతో పిసిఒడి వంటి సమస్యలు తలెత్తుతాయి. షుగర్ కు సంబంధించిన మందులు వాడడం వల్ల వారిలో ఆకలి మరింత ఎక్కువగా అవుతుంది.
దీంతో మరింత ఎక్కువగా ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు.దీంతో వారు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అధిక బరువు, పిసిఒడి వంటి సమస్యలతో బాధపడే వారు డయాబెటిస్ కు సంబంధించిన మందులు వాడే అవసరం లేకుండా సహజ సిద్దంగా కూడా ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవచ్చు. సహజంగా లభించే స్కై ఫ్రూట్ ను తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతను తగ్గించుకోవచ్చు. దీనిని షుగర్ బాదం అని కూడా అంటారు. ఈ పండు చేదుగా ఉంటుంది. ఈ పండును ముక్కలుగా చేసుకుని ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి మింగితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పండును తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గుతుందని నిపుణులు పరిశోధనల వెల్లడించారు.
దీనిని తీసుకోవడం వల్ల రక్తంలో ఉండే చక్కెర వెంటనే కణంలోకి వెళ్తుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. నీటి బుడగల సమస్యలతో బాధపడే స్త్రీలకు ఈ షుగర్ బాదం ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు. దీనిని వాడిన రెండు నుండి మూడు రోజుల్లోనే మంచి ఫలితం ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ స్కై ఫ్రూట్ ను రోజుకు రెండు పలుకుల చొప్పున ఆహారానికి అరగంట ముందు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకత తగ్గడంతో పాటు భవిష్యత్తులో కూడా షుగర్ రాకుండా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
అలాగే దీనిని తీసుకోవడం వల్ల ఊబకాయం సమస్య నుండి కూడా బయటపడవచ్చని వారు తెలియజేస్తున్నారు. చక్కటి ఆహార నియమాలను పాటిస్తూ జీవన విధానంలో మార్పు చేసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత సమస్యలు తగ్గు ముఖం పడతాయని దీంతో నీటి బుడగలు వాటంతట అవే సహజ సిద్దంగా తగ్గి పోతాయని నిపుణులు చెబుతున్నారు.