Anjeer : చలికాలంలో సహజంగానే మనల్ని అనేక అనారోగ్య సమస్యలు ఇబ్బందులకు గురి చేస్తుంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు తప్పనిసరిగా వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో పోషకాలతో కూడిన ఆహారాలను తీసుకోవడం వల్ల ఆయా వ్యాధులు రాకుండా ముందుగానే జాగ్రత్త పడవచ్చు. ఇక కరోనా కాలం కనుక పోషకాహారం తీసుకోవడం వల్ల ఆ వైరస్ నుంచి కూడా రక్షణ లభిస్తుంది.
చలికాలంలో మనం తీసుకోవాల్సిన ఆహారాల్లో అంజీర్ ఒకటి. ఇది మనకు పండు లేదా డ్రై ఫ్రూట్ రూపంలో లభిస్తుంది. దీన్ని ఈ సీజన్‌లో తప్పనిసరిగా రోజూ తీసుకోవాలి. అంజీర్‌ను ఈ సీజన్‌లో తీసుకోవడం వల్ల ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. ఈ సీజన్‌లో సహజంగానే మలబద్దకం సమస్య చాలా మందిని ఇబ్బందులకు గురిచేస్తుంటుంది. అలాంటి వారు ఉదయం 4 అంజీర్ డ్రై ఫ్రూట్ పండ్లను నీటిలో నానబెట్టాలి. రాత్రి నిద్రకు ముందు వాటిని తినాలి. దీంతో మరుసటి రోజు ఉదయం సుఖ విరేచనం అవుతుంది. రోజూ ఇలా చేస్తే మలబద్దకం నుంచి బయట పడవచ్చు. అలాగే తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది. ఇతర జీర్ణ సమస్యలు ఉండవు.
2. అంజీర్ పండ్లలో జింక్, మాంగనీస్, మెగ్నిషియం, ఐరన్ సమృద్ధిగా ఉంటాయి. అందువల్ల శృంగార సమస్యలతో ఇబ్బందులు పడుతున్న స్త్రీ, పురుషులు వీటిని తింటే ఆయా సమస్యల నుంచి బయట పడవచ్చు. శృంగారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు.
3. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు రోజూ అంజీర్ పండ్లను తీసుకోవాలి. వీటిల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. అందువల్ల శరీరంలో ఉన్న కొవ్వును కరిగించేందుకు సహాయ పడుతుంది. దీంతో అధిక బరువు తగ్గుతారు.
4. అంజీర్ డ్రై ఫ్రూట్ పండ్లలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముకలు, దంతాలను దృఢంగా చేస్తుంది. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, ఇతర ఎముకల నొప్పులు ఉన్నవారు ఈ పండ్లను తింటే ఆయా నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది.
5. చలికాలంలో చాలా మంది చలిని తట్టుకోలేరు. కానీ అంజీర్ పండ్లను రోజూ తినడం వల్ల శరీరం వెచ్చగా మారుతుంది. అందుకుగాను రాత్రి నిద్రకు ముందు 2, 3 అంజీర్ డ్రై ఫ్రూట్స్‌ను తిని ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలను తాగాలి. దీంతో శరీరం వెచ్చగా ఉంటుంది. చలి నుంచి రక్షణ లభిస్తుంది.