Fruits : పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి, బరువు తగ్గి అందంగా, నాజుకుగా కనబడాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అలా కనిపించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. బరువు తగ్గాలంటే ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను తక్కువగా తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. క్యాలరీలు తక్కువగా ఉండే ఆహారాల్లో పండ్లు కూడా ఒకటి. పండ్లను తినడం వల్ల బరువు తగ్గడంతో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. తక్కువ శక్తి, ఎక్కువ పీచు పదార్థాలు ఉన్న పండ్లను తీసుకోవడం వల్ల మనం త్వరగా బరువు తగ్గవచ్చు.
బరువు బాగా తగ్గాలన్నా, శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగాలన్నా, ఆరోగ్యంగా తయారవ్వాలన్నా, అజీర్తి ,మలబద్దకం వంటి సమస్యలు రాకుండా ఉండాలన్నా సాయంత్రం పూట పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. పొట్ట చుట్టూ, నడుము చుట్టూ ఉండే అలాగే శరీర భాగాల్లో పేరుకుపోయిన కొవ్వు కరిగి బరువును తగ్గించే పండ్ల గురించి ఇప్పుడు తెలుపుకుందాం. అన్నింటి కంటే తక్కువ క్యాలరీలు ఉన్న పండ్లల్లో పుచ్చకాయ ఒకటి. 100 గ్రా. ల పుచ్చకాయ గుజ్జులో 16 క్యాలరీలు ఉంటాయి. పావు కిలో పుచ్చకాయ ఒక చిన్న ఇడ్లీతో సమానమైన శక్తిని కలిగి ఉంటుంది.
పుచ్చకాయను తీసుకోవడం వల్ల బరువు చాలా సలుభంగా తగ్గవచ్చు. అలాగే ఖర్బూజను తీసుకోవడం వల్ల కూడా మనం శరీరంలో ఉన్న కొవ్వును కరిగించుకోవచ్చు. చాలా మంది ఖర్బూజను తక్కువగా తీసుకుంటారు. పుచ్చకాయను ఎక్కువగా తీసుకుంటారు. కానీ పోషకాలు, విటమిన్స్, లవణాలు ఖర్బూజాలో ఎక్కువగా ఉంటాయి. సహజ సిద్దమైన ఉప్పును ఎక్కువగా కలిగి ఉండే ఆహారాల్లో ఖర్బూజ ఒకటి. 100 గ్రా. ఖర్బూజాలో 100 నుండి 105 మిల్లీ గ్రాముల సోడియం ఉంటుంది. దీనిని తీసుకోవడం వల్ల కూడా మనం బరువు తగ్గవచ్చు. అలాగే తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచులు ఉన్న ఆహారాల్లో బొప్పాయి పండు ఒకటి. 100 గ్రాముల బొప్పాయిలో 32 క్యాలరీలు ఉంటాయి.
దీనిని ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది. అలాగే మనం బరువు తగ్గాలనుకునే వారు తీసుకోవాల్సిన పండ్లల్లో బత్తాయి పండు ఒకటి. 100 గ్రాముల బత్తాయిని తీసుకుంటే అందులో 45 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అలాగే కమలా పండ్లను తీసుకోవడం వల్ల కూడా సులభంగా బరువు తగ్గవచ్చు. 100 గ్రాముల కమలా పండ్లల్లో 48 క్యాలరీల శక్తి ఉంటుంది. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగి నాజుకుగా తయారు కావచ్చు. అదే విధంగా బరువు తగ్గాల్సిన వారు ఎక్కువగా తీసుకోవాల్సిన ఆహారాల్లో జామ కాయ ఒకటి. దీనిలో 45 నుండి 50 క్యాలరీల శక్తి ఉంటుంది.
దీనిని తీసుకోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మన ఇతర ఆరోగ్య ప్రయోజనాలను కూడా పొందవచ్చు. ఈ పండ్లల్లో తక్కువ క్యాలరీలు ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి. బరువు తగ్గడంలో , పొట్ట చుట్టూ పేరుకుపోయిన కొవ్వును కరిగించడంలో ఈ పండ్లు మనకు ఎంతో ఉపయోగపడతాయి. ఈ పండ్లను రాత్రి పూట భోజనంగా తీసుకోవాలి. అలాగే వీటిని తీసుకున్న తరువాత ఎటువంటి ఆహారాలను తీసుకోకూడదు. అదేవిధంగా వీటిని సాయంత్రం 7 గంటల లోపు తీసుకోవాలి. ఈ విధంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల పొట్టు చుట్టూ పేరుకుపోయిన కొవ్వు కరిగి, అధిక బరువు సమస్య నుండి బయటపడతారు. అంతేకాకుండా చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు.