Constipation : చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. ఎక్కువ మంది మలబద్ధకంతో బాధపడుతూ ఉంటారు. మీకు కూడా మలబద్ధకం ఉందా..? అయితే,ఇలా చేయండి. మలబద్ధకం సమస్య నుండి సులభంగా బయటికి వచ్చేయొచ్చు. ఈ సమస్యతో బాధపడే వాళ్ళకి చాలా కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఈ పండ్లను తీసుకోండి. దాంతో సమస్య ఉండదు.
ఆహారంలో తగినంత ఫైబర్ లేకపోవడం, తక్కువ నీళ్లు తాగడం, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, రాత్రి పూట లేటుగా ఆహారాన్ని తినడం, కాఫీ, టీ, పొగాకు, సిగరెట్లు ఎక్కువ తీసుకోవడం, మైదా, నూనె, వేయించిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన ఎక్కువగా ఈ సమస్య కలుగుతూ ఉంటుంది. అయితే ఈ సమస్య నుండి బయటపడడానికి ఈ పండ్లను తీసుకోండి. ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి ఇవి. ఎన్నో పోషకాలు వీటిలో ఉంటాయి. అలాగే మలబద్దకం కూడా ఉండదు.
ఈ సమస్య నుండి బయటపడడానికి బొప్పాయి సహాయపడుతుంది. కాబట్టి రెగ్యులర్ గా బొప్పాయి పండ్లను తీసుకుంటూ ఉండండి. ఆపిల్ తీసుకోవడం వలన కూడా ఈ సమస్య ఉండదు. ఆపిల్స్ తీసుకోవడం వలన పొట్ట బాగా శుభ్రం అవుతుంది. ఆపిల్ తీసుకుంటే చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ద్రాక్ష పండ్లను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. ద్రాక్షలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి.
ద్రాక్ష పండ్లను తీసుకుంటే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే నారింజ పండ్లను తీసుకుంటే కూడా ఈ సమస్య ఉండదు. అరటి పండ్లలో కూడా పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్య నుండి అరటి పండు కూడా మిమ్మల్ని గట్టెక్కిస్తుంది. అవకాడో, ప్లమ్ కూడా తీసుకుంటూ ఉండండి. ఇలా ఈ పండ్లను మీరు తీసుకున్నట్లయితే కచ్చితంగా ఈ సమస్య నుండి ఈజీగా బయటపడవచ్చు. ఎలాంటి బాధ ఉండదు.