Uric Acid Levels : ప్రస్తుత కాలంలో మనలో చాలా మంది శరీరంలో యూరిక్ యాసిడ్ సమస్యతో బాధపడుతున్నారు. శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల గౌట్ తో మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలు కూడా తలెత్తుతాయి. గౌట్ సమస్యతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుందనే చెప్పవచ్చు. కొన్ని రకాల పండ్లను తీసుకోవడం వల్ల మనం శరీరంలో ఈ యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించే ఆహారాల్లో జామకాయలు ఒకటి. జామకాయలో విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్లు అధిక మోతాదులో ఉంటాయి.
ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. అలాగే జామకాయలను తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. అలాగే జామకాయను తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. అలాగే నిమ్మరసాన్ని కూడా తరచూ తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే విటమిన్ సి యూరిక్ యాసిడ్ ను నియంత్రించడంలో సహాయపడుతుంది.
ఈ నిమ్మరసాన్ని ఏ రూపంలో తీసుకున్నా కూడా మనకు చక్కటి ఉపశమనం కలుగుతుంది. అలాగే యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో మనకు లిచీ పండ్లు కూడా ఎంతగానో ఉపయోగపడతాయి. లిచీ పండ్లల్లో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచడంలో దోహదపడతాయి. కనుక రోజుకు 2 లేదా 3 లిచీ పండ్లను తినడం వల్ల కూడా మనం చక్కటి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అదే విధంగా యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువయ్యి ఇబ్బందులకు గురి అవుతున్నవారు బత్తాయి పండ్లను తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
రోజుకు ఒక బత్తాయిని తీసుకోవడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు యూరిక్ యాసిడ్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మన శరీరంలో యూరిక్ యాసిడ్ వివిధ రకాల విధులను నిర్వర్తిస్తుంది. కానీ ఇది తగిన మోతాదులో ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. యూరిక్ యాసిడ్ ఎక్కువవడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు వస్తాయి. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కనుక యూరిక్ యాసిడ్ స్థాయిలను అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. మన ఆహారంలో భాగంగా ఈ పండ్లను తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న యూరిక్ యాసిడ్ స్థాయిలు అదుపులోకి వస్తాయని నిపుణులు చెబుతున్నారు.