Watermelon : పుచ్చ‌కాయ‌ల‌ను అధికంగా తింటున్నారా.. అయితే ముందు ఇది చ‌ద‌వండి..!

Watermelon : బ‌రువు త‌గ్గ‌డానికి మ‌న‌లో చాలా మంది అనేక ర‌కా ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు. వ్యాయామం చేయ‌డం, చ‌క్క‌టి జీవ‌న‌విధానాన్ని పాటించ‌డం వంటి వాటితో పాటు అనేక ర‌కాల డైట్ ల‌ను కూడా పాటిస్తూ ఉంటారు. అయితే మ‌నం సుల‌భంగా పాటించ‌గ‌లిగిన వివిధ రకాల డైట్ ల‌లో వాట‌ర్ మెల‌న్ డైట్ కూడా ఒక‌టి. వాటర్ మెల‌న్ ( ప‌చ్చుకాయ ) మ‌నంద‌రికి తెలిసిందే. దీనిని చాలా మంది ఇష్టంగా తింటారు. పుచ్చకాయ‌ను తిన‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంద‌న్న సంగ‌తి మ‌న‌కు తెలిసిందే. అయితే బ‌రువు తగ్గ‌డానికి పుచ్చ‌కాయ మ‌న‌కు ఎంతో మేలు చేస్తుంద‌ని నిపుణులు చెబుతున్నారు. వాట‌ర్ మెల‌న్ డైట్ ను 3 నుండి 7 రోజుల పాటు మాత్ర‌మే పాటించాల్సి ఉంటుంది. ఇత‌ర పండ్ల‌ను, కూర‌గాయ ముక్క‌ల‌ను తీసుకున్న‌ప్ప‌టికి అధిక మొత్తంలో పుచ్చ‌కాయ‌ను తీసుకోవాల్సి ఉంటుంది.

పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయ‌న్ని నిపుణులు చెబుతున్నారు. దీనిలో త‌క్కువ క్యాల‌రీలు ఉండ‌డంతో పాటు అనేక ర‌కాల మిన‌ర‌ల్స్ కూడా ఉన్నాయి. త్వ‌ర‌గా బ‌రువు త‌గ్గేలా చేయ‌డంతో పాటు శ‌రీరంలో పేరుకుపోయిన వ్య‌ర్థాల‌ను తొల‌గించ‌డంలో కూడా పుచ్చ‌కాయ మ‌న‌కు ఎంతో స‌హాయ‌ప‌డుతుంది. వాట‌ర్ మెల‌న్ డైట్ వ‌ల్ల మ‌న‌కు క‌లిగే ప్ర‌యోజ‌నాలు ఏమిటి…అన్న వివ‌రాల‌ను ఇప్పుడు తెలుసుకుందాం. పుచ్చ‌కాయ‌లో త‌క్కువ క్యాల‌రీలు ఉంటాయి. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకున్న‌ప్ప‌టికి మ‌న శ‌రీరానికి క్యాల‌రీలు త‌క్కువ‌గా అదుతాయి. దీనిని తిన‌డం వ‌ల్ల మ‌న క‌డుపు నిండిన భావ‌న క‌లుగుతుంది. దీంతో మ‌నం త్వ‌ర‌గా త‌గ్గ‌వ‌చ్చు. అలాగే పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల శరీరం డీ హైడ్రేష‌న్ కు గురి కాకుండా ఉంటుంది. వేసవికాలంలో దీనిని తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న ఆరోగ్యానికి మ‌రింత మేలు క‌లుగుతుంది.

Watermelon eating important facts to know
Watermelon

అలాగే పుచ్చ‌కాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, పొటాషియం వంటి పోష‌కాలు మ‌న శ‌రీరానికి అందుతాయి. ఇవి శ‌రీరంలో రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచ‌డంలో, చ‌ర్మ ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలో, ర‌క్త‌పోటును అదుపులో ఉంచ‌డంలో ఇలా అనేక ర‌కాలుగా పుచ్చ‌కాయ మ‌న‌కు స‌హాయ‌ప‌డుతుంది. వాట‌ర్ మెల‌న్ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల శ‌రీరంలో ఎక్కువ‌గా నీరు, మ‌లినాలు, వ్య‌ర్థ ప‌దార్థాలు తొల‌గిపోతాయి. జీర్ణ‌వ్య‌వ‌స్థ మెరుగుప‌డుతుంది. పుచ్చకాయ‌లో 90 శాతం నీరు, ఫైబ‌ర్ ల‌తో పాటు ఇత‌ర పోష‌కాలు ఉంటాయి. బ‌రువు త‌గ్గ‌డంలో ఇది ఎంత‌గానో తోడ్ప‌డుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. అయితే ఈ వాట‌ర్ మెల‌న్ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల కొన్ని దుష్ప్ర‌భావాలు కూడా ఉన్నాయ‌ని వారు చెబుతున్నారు. ఈ డైట్ ను ఎక్కువ కాలం పాటించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరంలో పోష‌కాల లోపం తలెత్తుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు, పుచ్చకాయ‌లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే అన్ని పోష‌కాలు ఉండ‌వు.

క‌నుక ఈ డైట్ ను ఎక్కువ కాలం పాటు పాటిచండం వ‌ల్ల పోష‌కాహార లోపం త‌లెత్తే అవ‌కాశం ఉంది. అలాగే పుచ్చ‌కాయ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ను క‌లిగి ఉంటుంది. దీనిని ఎక్కువ మొత్తంలో తీసుకోవ‌డం వ‌ల్ల ర‌క్తంలో చ‌క్కెర స్థాయిలు పెరిగే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. క‌నుక డ‌యాబెటిస్ తో బాధ‌ప‌డే వారు ఈ డైట్ ను పాటించ‌క‌పోవ‌డ‌మే మంచిది. అలాగే ఈ డైట్ ను పాటించ‌డం వ‌ల్ల మ‌న శ‌రీరానికి కావల్సినంత శ‌క్తి ల‌భించ‌దు. క‌నుక త‌ర‌చూ ఆక‌లి అవుతుంది. దీంతో మ‌నం ఈ డైట్ ను స‌రిగ్గా పాటించ‌లేక‌పోతాము. అలాగే ఎక్కువ మొత్తంలో పుచ్చకాయ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ‌స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం కూడా ఉంది. క‌డుపు ఉబ్బ‌రం, డ‌యేరియా వంటి జీర్ణ‌స‌మ‌స్య‌ల బారిన ప‌డే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. వాట‌ర్ మెల‌న్ డైట్ మంచిదే అయిన‌ప్ప‌టికి దీనిని త‌క్కువ కాలం మాత్ర‌మే పాటించాలి అలాగే పోష‌కాహార నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో మాత్ర‌మే పాటించాల‌ని నిపుణులు సూచిస్తున్నారు.

D

Recent Posts