Mango Pulp : మామిడి పండును పండ్లకు రారాజు అని పిలుస్తారనే విషయం తెలిసిందే. అన్ని రకాల పండ్లలో ఉండే పోషకాలన్నీ దాదాపుగా మామిడి పండ్లలోనూ ఉంటాయి. పైగా తియ్యని రుచిని కలిగి ఉంటాయి. కనుకనే దీన్ని పండ్లకు రారాజు అని పిలుస్తారు. ఇక మామిడి పండ్లను తినడం వల్ల మనకు అనేక రకాల ప్రయోజనాలు కలుగుతాయి. కానీ కొందరు ఈ పండ్లను తిని తొక్కలను పడేస్తుంటారు. అయితే వాస్తవానికి ఈ పండ్ల తొక్కల్లోనూ అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయి. మామిడి పండ్ల తొక్కలను కూడా తినాల్సిందే. వీటి వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అవేమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
మామిడి పండ్ల తొక్కలను ఇష్టం లేకున్నా సరే తప్పనిసరిగా తినాల్సిందే. ఎందుకంటే ఈ తొక్కలలో విటమిన్ ఎ అధికంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగు పరుస్తుంది. అలాగే మామిడి పండ్ల తొక్కలలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాధులు రాకుండా రక్షిస్తుంది. ఇక ఈ తొక్కల్లో మన శరీరానికి ఉపయోగపడే అనేక విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మారుస్తాయి.
మామిడి పండ్ల తొక్కలను తినడం వల్ల ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. ఇది రక్తం బాగా తయారయ్యేలా చేస్తుంది. రక్తహీనతను తగ్గిస్తుంది. దీంతోపాటు జ్ఞాపకశక్తి పెరుగుతుంది. అలాగే మామిడి పండ్ల తొక్కలను తినడం వల్ల బీపీ, కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హార్ట్ ఎటాక్‌లు రాకుండా చూసుకోవచ్చు. ఈ తొక్కల వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. గ్యాస్, మలబద్దకం, అజీర్ణం తగ్గుతాయి.
మామిడి పండ్ల తొక్కలను గర్భిణీలు తింటే ఎంతో మేలు జరుగుతుంది. దీని వల్ల బిడ్డ ఎదుగుదలకు అవసరం అయిన పోషకాలు లభిస్తాయి. ఇలా మామిడి పండ్ల తొక్కలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు. కనుక ఇకపై ఎప్పుడైనా సరే ఈ పండ్లను తింటే తొక్కలతో సహా తినండి. పడేయకండి. లేదంటే నష్టపోతారు. అయితే ప్రస్తుతం మనకు మార్కెట్‌లో రసాయనాలు ఉపయోగించి పండించిన మామిడి పండ్లే లభిస్తున్నాయి. కనుక అలాంటప్పుడు ఆ పండ్ల తొక్కలను తినకపోవడమే మంచిది. సహజసిద్ధంగా లభించే ఆర్గానిక్ పండ్లకు చెందిన తొక్కలను భేషుగ్గా తినవచ్చు. ఎలాంటి భయం చెందాల్సిన పనిలేదు. కానీ శుభ్రంగా కడిగి తినాలి. ఇలా మామిడి పండ్ల తొక్కలతో మనం అనేక లాభాలను పొందవచ్చు.