Green Apple : రోజూ ఒక యాపిల్ ను తీసుకుంటే వైద్యుడిని సంప్రదించే అవసరమే ఉండదంటారు. అందులోనూ గ్రీన్ యాపిల్ వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. గ్రీన్ ఆపిల్ అనేది ఒకప్పుడు చాలా అరుదుగా లభించేది. ఇప్పుడు విరివిగానే లభిస్తోంది. పులుపు, తియ్యని రుచి కలిగి ఉండే ఈ ఆపిల్ లో ప్రోటీన్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ సమృద్ధిగా ఉంటాయి. అలాగే ఐరన్, రాగి, జింక్, మాంగనీస్, పొటాషియం వంటివి కూడా ఉంటాయి. గ్రీన్ యాపిల్‌లోని ఐరన్ రక్తంలో ఆక్సిజన్ స్థాయిలను పెంచడానికి తోడ్పడుతుంది.
థైరాయిడ్ సమస్యలు, కీళ్లకు సంబంధించిన సమస్యలు, మతిమరుపు సమస్యలు ఉన్నవారు ప్రతిరోజు ఒక గ్రీన్ ఆపిల్ తింటే మంచిది. మెదడులో ఎసిటైల్ కోలీన్ స్రావాన్ని పెంచటం ద్వారా న్యూరో ట్రాన్స్ మిటర్ల పనితీరు మెరుగై అల్జీమర్స్ సమస్య నుండి విముక్తి లభించేలా చేస్తాయి. అలాగే రక్తంలో కొలెస్ట్రాల్ ని తగ్గిస్తాయి. గుండెకు రక్తప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. గ్రీన్ ఆపిల్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో కణాల నిర్మాణానికి సహాయపడతాయి.
గ్రీన్ ఆపిల్ లో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండుట వలన కణాల పునర్నిర్మాణం, కణాల పునరుజ్జీవనంలో సహాయపడుతుంది. కాలేయ పనితీరును మెరుగుపరచి కాలేయం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అలాగే బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మైగ్రేన్ తలనొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. మొటిమలను నివారించే గుణాలు ఇందులో ఉన్నాయి. అలాగే గ్రీన్ ఆపిల్ కళ్ల కింద నల్లటి వలయాలను తొలగిస్తుంది. ఇంకెందుకు ఆలస్యం మార్కెట్ లో గ్రీన్ ఆపిల్ కనిపిస్తే తీసుకోవడం మర్చిపోకండి.