Boiled Peanuts : మనం ఆహారంగా తీసుకునే నూనె గింజల్లో పల్లీలు ఒకటి. వీటిని వేరు శనగ గింజలు అని కూడా అంటారు. పల్లీలతో రకరకాల పచ్చళ్లను, చిరు తిళ్లను తయారు చేసుకుని తింటూ ఉంటాం. అంతేకాకుండా వీటి నుండి తీసిన నూనెను కూడా మనం వంటల్లో ఉపయోగిస్తూ ఉంటాం. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల ప్రోటీన్స్, మినరల్స్, విటమిన్స్ తో పాటు ఇతర పోషకాలను కూడా పొందవచ్చు. అయితే చాలా మంది వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు చేరుతుందని. అలర్జీలు వస్తాయని వీటిని ఆహారంగా తీసుకోవడమే మానేస్తారు. దీనిని దృష్టిలో పెట్టుకుని చాలా మంది పల్లి నూనెకు బదులుగా ప్రొద్దు తిరుగుడు నూనెను ఉపయోగిస్తున్నారు.
కానీ నిజానికి రోజూ ఒక గుప్పెడు పల్లీలను తింటే మనం ఎన్నో చక్కటి ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. పల్లీలల్లో ప్రోటీన్ప్ అధికంగా ఉంటాయి. వీటిని డ్రై ఫ్రూట్స్ లో భాగంగా రోజూ తినవచ్చు. పల్లీలు రుచిగా ఉంటాయి. అలాగే ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. కనుక రోజూ కనీసం పది పల్లీలనైనా తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను సలాడ్ లలో చేర్చుకుని కూడా తినవచ్చు. పల్లీలను పరిమితిగా తీసుకుంటే శరీరంలో ఎటువంటి కొవ్వు చేరదు. అలర్జీలు కూడా మన దరి చేరుకుండా ఉంటాయి. పల్లీలను తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్యకరమైన ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతిరోజూ కనీసం పది పల్లి గింజలను తినడం వల్ల క్యాన్సర్ మన దరి చేరుకుండా ఉంటుంది.
పల్లీలల్లో ఉండే పాలీ పినాలిక్స్, యాంటీ ఆక్సిడెంట్లు గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ను నివారిస్తాయి. వీటి ఆహారంగా తీసుకోవడం వల్ల పెద్ద ప్రేగు క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. పల్లీలను ఆహారంగా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. పల్లీలలో మోనో సాచ్యురేటేడ్, పాలీ సాచ్యురేటేడ్ కొవ్వులు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో ఉన్న చెడు కొవ్వు తొలిగిపోయి గుండెకు మేలు కలుగుతుంది. పల్లీలను తరచూ తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి పెరుగుతుంది. మెదడుకు కావల్సిన పోషకాలు కూడా పల్లీలలో అధికంగా ఉంటాయి. వీటిలో ఉండే విటమిన్ బి3 మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. పల్లీలలో ఉండే ఆమినో యాసిడ్లు సరోటిన్ ఉత్పత్తిని పెంచుతాయి.
ఈ సరోటిన్ మనలోని డిప్రెషన్ ను తగ్గించడంలో సహాయపడుతుంది. రోజూ 30 గ్రాముల పల్లీలను తినడం వల్ల పిత్తాశయంలో రాళ్లు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల పిత్తాశయంలో రాళ్లు వచ్చే అవకాశాలు 25 శాతం వరకు తక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీటిలో ఉండే నియాసిన్ అల్జీమర్స్ బారిన పడకుండా చేయడంలో సహాయపడుతుంది. అలాగే పది పల్లి గింజలను రోజూ తీసుకోవడం వల్ల మనం ఫోలిక్ యాసిడ్ ను కూడా పొందవచ్చు. ఈ ఫోలిక్ యాసిడ్ గర్భిణీ స్త్రీలకు ఎంతగానో మేలు చేస్తుంది. వీటిని తీసుకోవడం వల్ల మనం తక్షణ శక్తిని కూడా పొందవచ్చు. ఈ విధంగా పల్లీలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వీటిని తగిన మోతాదులో తీసుకోవడం వల్ల శరీరానికి ఎటువంటి హాని కలగదని నిపుణులు చెబుతున్నారు.