Phool Makhana And Sesame Seeds : మూడు పూటలా తిన్నప్పటికి కొందరు ఎప్పుడూ చూసిన చాలా నీరసంగా ఉంటారు. తరచూ అనారోగ్యాల బారిన పడుతుంటారు. ఎంత తిన్నప్పటికి శరీరానికి సరైన పోషకాలు అందకపోవడం వల్ల ఇలా నీరసంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి తగినన్ని పోషకాలు అందక పోవడం వల్ల రక్తహీనత, ఎముకలు బలహీనంగా తయారవ్వడం, జ్ఞాపకశక్తి తగ్గడం, కండరాలు బలహీనంగా తయారవ్వడం, శరీరంలో నొప్పులు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం, చర్మం పాలిపోవడం, ఆకలి లేకపోవడం, డిప్రేషన్ , చేతులు మరియు అరికాళ్లు తిమ్మిర్లు ఎక్కువగా రావడం వంటి అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కనుక మన శరీరానికి తగినన్ని పోషకాలు అందేలా చూసుకోవడం చాలా అవసరం.
మన ఇంట్లో ఒక డ్రింక్ ను తయారు చేసుకుని దానిని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల అలసట, నొప్పులు, రక్తహీనత వంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ డ్రింక్ ను తయారు చేసుకోవడానికి గానూ మనకు ముందుగా కావల్సినవి ఫూల్ మఖనా. వీటిని తామర పువ్వు గింజల నుండి తయారు చేస్తారు. వీటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ముదురు గోధుమ, తెలుపు రంగుల్లో ఉండే వీటిని కూరగా కూడా వండుకుని తింటారు. మనకు బయట మార్కెట్ లో ఇవి విరివిరిగా లభిస్తాయి. పోషకాహార లోపంతో బాధపడే వారు ముందుగా ఒక గిన్నెలో ఒక గ్లాస్ పాలను తీసుకుని వేడి చేయాలి. పాలు కొద్దిగా వేడయ్యాక ఈ ఫూల్ మఖనీని వేసి ఒక పొంగు వచ్చే వరకు వేడి చేయాలి. తరువాత ఈ పాలను ఒక గ్లాస్ లోకి తీసుకోవాలి. తరువాత ఈ పాలల్లో ఒక టీ స్పూన్ నువ్వుల పొడిని వేసి కలపాలి. దీనిలో తీపి కొరకు బెల్లాన్ని లేదా పటిక బెల్లాన్ని వేసుకోవాలి.
పంచదారను మాత్రం ఉపయోగించకూడదు. ఇలా తయారు చేసుకున్న డ్రింక్ ను ఉదయ అల్పాహార సమయంలో లేదా రాత్రి నిద్రపోవడానికి అర గంట ముందు తీసుకోవాలి. ఈ పాలను తాగుతూ ఫూల్ మఖనీని కూడా తినాలి. అదే విధంగా ఈ డ్రింక్ ను తాగినన్ని రోజులు టీ , కాఫీలకు దూరంగా ఉండడం మంచిది. ఈ డ్రింక్ ను తీసుకోవడంతో పాటుచ నానబెట్టిన బాదం పప్పుల పై ఉండే పొట్టును తీసేసి తినాలి. నెల రోజుల పాటు ఈ చిట్కాను పాటించడం వల్ల శరీరానికి తగినన్ని పోషకాలు అంది నీరసం తగ్గుతుంది. ఈ చిట్కాను పాటించడం వల్ల రక్తహీనత, మోకాళ్ల నొప్పులు, వెన్ను నొప్పి వంటి సమస్యలతో పాటు అనేక ఇతర అనారోగ్య సమస్యలు కూడా తగ్గు ముఖం పడతాయి.